BREAKING
నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... థాయ్‌లాండ్‌లో ప్రతిపక్ష ఎంపీకి భారీ ఊరట దక్షిణ కొరియా కేబినెట్‌లో కీలక మార్పులు ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంలో రష్యా భీకర దాడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు... ప్రభుత్వ భూములు అమ్మొద్దు - ఎంపీ ఆర్. కృష్ణయ్య శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి వివోఏ లకు కనీస వేతనం ప్రకటించాలి ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం: ప్రొఫెసర్‌ హరగోపాల్‌ బెల్గాం ఎయిర్‌పోర్ట్ మూసివేత అలర్ట్: కమ్యూనిస్టుల ఐక్యతతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం.: సినీ నటుడు మాదాల రవి

ఏఎంఆర్‌పై అవగాహనకు కిమ్స్‌ ఆధ్వర్యంలో రన్ ఫర్ ఏఎంఆర్

Select Suryaa Now
ఏఎంఆర్‌పై అవగాహనకు కిమ్స్‌ ఆధ్వర్యంలో రన్ ఫర్ ఏఎంఆర్
హైదరాబాద్‌,మేజర్ న్యూస్ ప్రతినిధి : వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్‌ వాడటం వల్ల భవిష్యత్తు లో సాధారణ ఇన్ఫెక్షన్లకు సైతం చికిత్స చేయడం కష్టతరమవుతుందని చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ ఏ.వి. గురవారెడ్డి హెచ్చరించారు. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌)పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కిమ్స్‌ హాస్పిటల్స్‌ కొండాపూర్‌ ఆధ్వర్యంలో ఆదివారం 'రన్ ఫర్ ఏఎంఆర్‌' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 500 మందికి పైగా పాల్గొన్నారు. ప్రపంచ యాంటీమైక్రోబియల్ అవేర్‌నెస్ వారోత్సవాల్లో భాగంగా 'వన్ హెల్త్.. వన్ యాక్షన్.. ప్రివెంట్ ఏఎంఆర్‌' నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2 కిలోమీటర్ల అవగాహన నడక, 5 కిలోమీటర్ల పరుగు చేపట్టారు. డాక్టర్ గురవారెడ్డి జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త యాంటీబయాటిక్ ఔషధం అభివృద్ధికి 15 నుంచి 20 ఏళ్లు పడుతుందని, అందుబాటులో ఉన్న మందుల ప్రభావాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలకు సైతం వైద్యుల సూచన లేకుండా యాంటీబయాటిక్స్‌ వాడకూడదని స్పష్టం చేశారు. శస్త్రచికిత్సల తర్వాత కూడా అవసరానికి మించి మందులు వినియోగించడం నిరోధకతకు దారితీస్తుందని తెలిపారు. కిమ్స్‌ కొండాపూర్‌ రీజినల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ విన్నమల, సీఓఓ సతీష్ పరేక్ మాట్లాడుతూ.. ఏఎంఆర్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సవాలుగా మారుతోందని, యాంటీబయాటిక్స్‌ను బాధ్యతా యుతంగా వినియోగించడంపై ప్రజల్లో అవగాహన పెరగాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో డాక్టర్ సుకేశ్, డాక్టర్ వాణి, డాక్టర్ రవితేజ, డాక్టర్ గిరీష తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని డాక్టర్ మహేశ్ సమన్వయం చేశారు. ఇన్ఫెక్షన్ల నివారణ, యాంటీబయాటిక్స్‌ సరైన వినియోగంపై సమాజంలో అవగాహన పెంచడమే కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు