BREAKING
న్యాయవాది అశ్వినికి గ్రామస్తుల ఘన సన్మానం శ్రీకాకుళం జిల్లాకు కనీసం రూ.100 కోట్ల నిధులు కూడా తీసుకురాలేనీ ప్రభుత్వం:మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవినీతి లేని పాలన అందిస్తా.. అభివృద్ధికి అంకితమవుతా...! సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి..... మంత్రతంత్రాల పేరుతో రూ.లక్షల్లో టోకరా - అంతర్రాష్ట్ర ముఠాలో ఐదుగురి అరెస్టు షీలానగర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ అర్షియా భాను ప్రమాణ స్వీకారం నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... థాయ్‌లాండ్‌లో ప్రతిపక్ష ఎంపీకి భారీ ఊరట దక్షిణ కొరియా కేబినెట్‌లో కీలక మార్పులు ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంలో రష్యా భీకర దాడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు...

మంత్రతంత్రాల పేరుతో రూ.లక్షల్లో టోకరా - అంతర్రాష్ట్ర ముఠాలో ఐదుగురి అరెస్టు

Select Suryaa Now
మంత్రతంత్రాల పేరుతో రూ.లక్షల్లో టోకరా - అంతర్రాష్ట్ర ముఠాలో ఐదుగురి అరెస్టు

సూర్యఆదిలాబాద్‌ : మంత్రతంత్రాలు, పూజల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఇచ్చోడ పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.3.74 లక్షల నగదు, మూడు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ కేసు వివరాలను వెల్లడించారు.అండర్‌ బ్రిడ్జి వద్ద నగదు అపహరణ ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారి-44 సమీపంలో ఈ నెల 19న ఈ ఘటన చోటుచేసుకుంది. తోకల రాజు, శ్రీపతి శంకర్‌లకు ఆదిలాబాద్‌ బస్టాండ్‌ వద్ద నిందితులు పరిచయమయ్యారు. తమకు మంత్రశక్తులు ఉన్నాయని, పూజల ద్వారా రూపాయి నోటును పది రూపాయలుగా మార్చగలమని నమ్మబలికారు. ఈ క్రమంలో ఇచ్చోడలోని టీజీడబ్ల్యూఆర్‌జేసీ పాఠశాల సమీపంలోని అండర్‌ బ్రిడ్జి వద్దకు రూ.3 లక్షల నగదుతో రావాలని సూచించారు. బాధితులు నగదు చూపిస్తున్న సమయంలో ఇద్దరు నిందితులు బలవంతంగా డబ్బులు లాక్కొని వారిపై దాడి చేసి కారులో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.బ్యాగులు మార్చి మాయాజాలంప్రధాన నిందితుడు ఆత్రం పరశురాం గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బక్కన్నతో కలిసి ముఠాగా ఏర్పడి, అతడి బంధువులైన శేఖర్‌, శైలేష్‌లను కూడా ఇందులో భాగస్వాములను చేసుకున్నాడు. అధిక మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశ చూపించి బాధితుల నుంచి నగదు వసూలు చేసేవారు. పూజల పేరుతో అసలు నగదు ఉన్న బ్యాగులను తెల్లకాగితాలు లేదా బొమ్మ నోట్లతో నింపిన బ్యాగులతో మార్చేవారు. ఐదు నుంచి పది రోజుల వరకు వాటిని తెరవవద్దని చెప్పి వెళ్లిపోయేవారు. బాధితులు నిలదీస్తే పూజ విఫలమైందని, మరోసారి పూజ చేయాలని నమ్మించి తిరిగి డబ్బులు వసూలు చేసేవారు.ఈ విధంగా మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, ఆసిఫాబాద్‌, కామారెడ్డి తదితర జిల్లాల్లో పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచుకొని వ్యక్తిగత అవసరాలు, కార్ల ఈఎంఐలు, ఇళ్ల నిర్మాణానికి వినియోగించినట్లు విచారణలో తేలింది.జిల్లాలో ఎనిమిది కేసులు నమోదు. ఈ ముఠాపై ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు, ఇంద్రవెల్లిలో ఐదు, ఇచ్చోడలో ఒక కేసు ఉన్నాయి. ఈ కేసుల్లో పది మంది బాధితులు ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24 మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అరెస్టయిన వారిలో ఆత్రం పరశురాం (గిన్నెర), మండలి బక్కన్న (శాంతినగర్‌ కాలనీ, ఇంద్రవెల్లి), నౌగడే శేఖర్‌ (వాంకిడి), మండలి శైలేష్‌ (కెరమెరి), షేక్‌ అలీం (సిర్పూర్‌(యు)) ఉన్నారు. మంత్రతంత్రాలు, పూజల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామనే మాటలు నమ్మి కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకోవద్దని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ప్రజలకు సూచించారు. ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో ఉట్నూర్‌ ఏఎస్పీ రుత్విక్‌ సాయి కొట్టే, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.