BREAKING
న్యాయవాది అశ్వినికి గ్రామస్తుల ఘన సన్మానం శ్రీకాకుళం జిల్లాకు కనీసం రూ.100 కోట్ల నిధులు కూడా తీసుకురాలేనీ ప్రభుత్వం:మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవినీతి లేని పాలన అందిస్తా.. అభివృద్ధికి అంకితమవుతా...! సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి..... మంత్రతంత్రాల పేరుతో రూ.లక్షల్లో టోకరా - అంతర్రాష్ట్ర ముఠాలో ఐదుగురి అరెస్టు షీలానగర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ అర్షియా భాను ప్రమాణ స్వీకారం నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... థాయ్‌లాండ్‌లో ప్రతిపక్ష ఎంపీకి భారీ ఊరట దక్షిణ కొరియా కేబినెట్‌లో కీలక మార్పులు ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంలో రష్యా భీకర దాడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు...

షీలానగర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Select Suryaa Now
షీలానగర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

 

గాజువాక, మేజర్ న్యూస్: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని  షీలా నగర్  ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఎస్‌టీబీఎల్ ప్రాంగణం వెనుకవైపు, రైల్వే ట్రాక్ పక్కనున్న తుప్పల్లోని కాలువలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి గాజువాక పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతుడి ఒంటిపై కేవలం షార్ట్ మాత్రమే ఉందని, ఎడమ చేతిపై తెలుగులో ‘అమ్మ’ అనే పచ్చబొట్టుతో పాటు కుడి చేతి మణికట్టుకు నల్లటి దారం కట్టి ఉందని పోలీసులు తెలిపారు. స్థానికంగా విచారించినా ఆచూకీ లభించకపోవడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పై ఆనవాళ్లు కలిగిన వ్యక్తి ఎవరైనా తప్పిపోయి ఉంటే, వారి కుటుంబ సభ్యులు లేదా తెలిసిన వారు వెంటనే గాజువాక పోలీస్ స్టేషన్‌లో గానీ, మహిళా ఎస్సై జి.హరిచందన (9492148734)ను గానీ సంప్రదించాలని పోలీసులు కోరారు.

రిపోర్టర్ : పీ.కోటిరెడ్డి,  గాజువాక ఇంచార్జ్, విశాఖపట్నం