కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ అర్షియా భాను ప్రమాణ స్వీకారం
కదిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్ పర్సన్ అర్షియా భాను, వైస్ చైర్మన్ విజయ్ కుమార్, కౌన్సిలర్ల చేత ఆర్డిఓ కళావతి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ , మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, జనసేన ఇంచార్జ్ భైరవ ప్రసాద్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ను నూతన చైర్మన్ కౌన్సిలర్లు దృశ్యా లువ కప్పి, పూల మాలలు వేసి ఘనంగా సన్మానించారు.