BREAKING
*కుర్వపల్లి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి: సంకాపురం రాముడు** గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం: డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ ఎన్నిక చిన్నారులపై మతపరమైన ఒత్తిడి తగదు వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి రెండో విడత దళితబంధు విడుదల చేయాలి అద్దేపల్లి లో సాయిబాబా ఎన్నికల ప్రచారం నా ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు....!? ** ముఖ్యమంత్రా... జిల్లా మంత్రా...!? ఆ డైరెక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటా: శర్వానంద్ నాగచైతన్యకు వెంకటేశ్ బర్త్‌డే విషెస్.. పోస్ట్ వైరల్ సులభంగా రైతులు ఎరువులు బుకింగ్ కోలాహలంగా అద్దంకి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. ఆధ్యాత్మిక గురువు సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వీడియో వైరల్ కాల్వబుగ్గలో భక్తజన సందోహం!** కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. 'రికార్డ్' టైటిల్ రివీల్ ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి వైయస్సార్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి - మాజీ ఎమ్మెల్యే బియ్యపు

వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి

Select Suryaa Now
వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి

సూర్య వీణవంక: ఈ రోజు కరీంనగర్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వీణవంక మండలానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని, వీణవంక మండలానికి కేటాయించిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను హుజురాబాద్ నుండి వీణవంక మండల కేంద్రానికి తక్షణమే తరలించాలని కోరుతూ సబ్ కలెక్టర్ **డాక్టర్ అశ్విని తానాజీ వాకడే కి** వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర అందుబాటులో లేకపోవడంతో సబ్ కలెక్టర్ని కలిసి సమస్యలను వివరించగా, ఆమె వెంటనే స్పందించి సంబంధిత సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని పిలిపించి, ఈ విషయాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వీణవంక మండల గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి రావడంతో పాటు, మండలానికి మంజూరైన గురుకుల పాఠశాల స్థానికంగానే కొనసాగాలని, తద్వారా పేద విద్యార్థులకు విద్యావకాశాలు మెరుగుపడతాయని ఈ సందర్భంగా కోరడం జరిగింది.వీణవంక మండల విద్యా, ఆర్థిక అభివృద్ధికి దోహదపడే ఈ రెండు ప్రధాన డిమాండ్లపై అధికారులు సానుకూలంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
పత్తి వేణుగోపాల్ రెడ్డి,తెలంగాణ ఉద్యమకారుడు,వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా.