BREAKING
కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు.. సీబీఐ ముమ్మర విచారణ *కుర్వపల్లి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి: సంకాపురం రాముడు** గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం: డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ ఎన్నిక చిన్నారులపై మతపరమైన ఒత్తిడి తగదు వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి రెండో విడత దళితబంధు విడుదల చేయాలి అద్దేపల్లి లో సాయిబాబా ఎన్నికల ప్రచారం నా ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు....!? ** ముఖ్యమంత్రా... జిల్లా మంత్రా...!? ఆ డైరెక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటా: శర్వానంద్ నాగచైతన్యకు వెంకటేశ్ బర్త్‌డే విషెస్.. పోస్ట్ వైరల్ సులభంగా రైతులు ఎరువులు బుకింగ్ కోలాహలంగా అద్దంకి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. ఆధ్యాత్మిక గురువు సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వీడియో వైరల్ కాల్వబుగ్గలో భక్తజన సందోహం!** కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. 'రికార్డ్' టైటిల్ రివీల్

చిన్నారులపై మతపరమైన ఒత్తిడి తగదు

Select Suryaa Now
చిన్నారులపై మతపరమైన ఒత్తిడి తగదు

సూర్య,కాగజ్‌నగర్:విద్య అనేది విజ్ఞానాన్ని, సంస్కారాలను, నైతిక విలువలను పెంపొందించే పవిత్రమైన మార్గమని, విద్యార్థులపై తల్లిదండ్రుల అనుమతి లేకుండా మతపరమైన అంశాలను బలవంతంగా రుద్దడం తగదని హిందూ జాగరణ మంచ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతినిధులు పేర్కొన్నారు.

కాగజ్‌నగర్ మండల పరిధిలోని సెయింట్ క్లారెన్స్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న చిన్నారికి బైబిల్‌లోని ఒక అంశాన్ని తప్పనిసరిగా చదువుకొని రావాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేసినట్లు విద్యార్థి తండ్రి ఆరోపించారు. ఈ విషయంపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

ఈ ఘటనపై స్పందించిన హిందూ జాగరణ మంచ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతినిధులు సోమవారం కాగజ్నగర్  మండల విద్యాశాఖ అధికారి వాసాల ప్రభాకర్ కు, మరియుకాగజ్‌నగర్ ఉప కలెక్టర్‌ హర్ష చౌదరికి  లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విద్యార్థులపై మతపరమైన అంశాల విషయంలో బలవంతం జరుగుతోందనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు వెలికితీయాలని కోరారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మం, నైతిక విలువల పట్ల చిన్నారుల్లో గౌరవభావం పెంపొందించడంతో పాటు అన్ని మతాల విశ్వాసాలను పరస్పరం గౌరవించేలా విద్యాసంస్థలు వ్యవహరించాలని నాయకులు సూచించారు. పాఠశాలలు విద్యాబోధనకు, వ్యక్తిత్వ వికాసానికి కేంద్రాలుగా ఉండాలే తప్ప విద్యార్థులపై ఎలాంటి మతపరమైన ఒత్తిడికి వేదికలు కాకూడదని స్పష్టం చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి లేకుండా మతపరమైన బోధనలో పాల్గొనాలని బలవంతం చేయరాదనే రాజ్యాంగ నిబంధనలను అధికారులు పరిశీలించాలని కోరారు. పాఠశాల గుర్తింపు నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు విచారణలో తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ పర్యవేక్షణ పెంచాలని విజ్ఞప్తి చేశారు.

అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో హిందూ జాగరణ మంచ్ కొమురం భీం జిల్లా అధ్యక్షుడు శివగౌడ్, భాజపా నాయకులు అరుణ్ లోయ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పట్టణ కార్యదర్శి రాకేష్, సంయుక్త కార్యదర్శి ప్రీతమ్, హిందూ జాగరణ మంచ్, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.