*కుర్వపల్లి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి: సంకాపురం రాముడు**
ఐజ సూర్య మేజర్ న్యూస్.-:ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మట్టి, క్రీడా మైదానం కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలని డిమాండ్
* గ్రామ ఉపసర్పంచ్, పెద్దలతో కలిసి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు
కుర్వపల్లి గ్రామ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం డీసీసీ ప్రధాన కార్యదర్శి సంకాపురం రాముడు ఆధ్వర్యంలో గ్రామ ఉపసర్పంచ్ బజారి, గ్రామ పెద్దలు అదనపు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మట్టిని తవ్వుకునేందుకు కొంత ప్రభుత్వ భూమిని కేటాయించాలని వారు కోరారు. అలాగే గ్రామంలోని యువత, విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల అవసరాలు, భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు అంశాలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సంకాపురం రాముడు అయిజ మండల ప్రజల పక్షాన నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
*ఐజ మండలం సూర్య రిపోర్టర్ వి ఆనంద్ రాజ్*