BREAKING
ఆ డైరెక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటా: శర్వానంద్ నాగచైతన్యకు వెంకటేశ్ బర్త్‌డే విషెస్.. పోస్ట్ వైరల్ సులభంగా రైతులు ఎరువులు బుకింగ్ కోలాహలంగా అద్దంకి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. ఆధ్యాత్మిక గురువు సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వీడియో వైరల్ కాల్వబుగ్గలో భక్తజన సందోహం!** కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. 'రికార్డ్' టైటిల్ రివీల్ ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి వైయస్సార్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి - మాజీ ఎమ్మెల్యే బియ్యపు ఆధార్ చూపిస్తే చాలు మూడు రోజులు సినిమా ఫ్రీ.. 'ఆలోచన' టీమ్ బంపర్ ఆఫర్! అనిరుధ్-కావ్య రిసెప్షన్.. ధోనితో విజయ్-రష్మిక సందడి అనన్య నాగళ్ల 'ది బ్రేకింగ్ న్యూస్' ట్రైలర్ రిలీజ్.. డిసెంబర్ 11న థియేటర్లలోకి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమం ప్రారంభించిన బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి ఎన్నికల వేళ అప్రమత్తం.. గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ ఎస్సై పి. సూర్యకుమారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా –ప్రజా ప్రభుత్వానికి అభినందనలు:* న్యాయవాది అశ్వినికి గ్రామస్తుల ఘన సన్మానం

సులభంగా రైతులు ఎరువులు బుకింగ్

Select Suryaa Now
సులభంగా రైతులు ఎరువులు బుకింగ్
 సులభంగా ఎరువులు బుకింగ్ - ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌పై అపోహలు వద్దు - శ్రీకాళహస్తి ఏడీఏ రమేష్ రెడ్డి.
 శ్రీకాళహస్తి ప్రాంతంలో
రైతులకు ఎరువులు పంపిణీని అత్యంత సులభతరం, పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్‌పై ఎలాంటి అపోహలు, ఆందోళనలు వద్దని శ్రీకాళహస్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ ఈ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ యాప్ వినియోగం, ప్రయోజనాలను వివరించారు.
క్యూలైన్ల బాధకు చెక్.. ఇంటి నుంచే బుకింగ్:
గతంలో మాదిరిగా ఎరువుల కోసం దుకాణాల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రైతులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటి నుంచే సమీపంలోని దుకాణాల్లో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ తదితర ఎరువుల నిల్వలను తెలుసుకోవచ్చని, సినిమా టికెట్లు బుక్ చేసుకున్నంత సులభంగా అవసరమైన బస్తాలను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. యాప్‌లో బుక్ చేసిన వెంటనే మొబైల్‌కు ఒక ప్రత్యేక క్యూఆర్ కోడ్ (టోకెన్) వస్తుందని, దానిని సంబంధిత దుకాణంలో చూపించి 48 గంటల్లోపు ఎరువులను పొందవచ్చని వివరించారు.
*అందరికీ ఫార్మర్ ఐడీ ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు*
 
పట్టాదారు రైతులే కాకుండా కౌలు రైతులు, ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, చెరువు శిఖం భూముల్లో సాగు చేస్తున్న వారు కూడా సమీప రైతు సేవా కేంద్రం  సిబ్బందిని సంప్రదించి 'ఫార్మర్ ఐడీ' పొందవచ్చని ఏడీఏ తెలిపారు. రైతులకు తక్షణ సహాయం అందించేందుకు ఆర్ఎస్‌కేలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ఎరువులు దుకాణాల వద్ద ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
యాప్ వినియోగం ఇలా:
గూగుల్ ప్లే స్టోర్ నుంచి  ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకుని ఫార్మర్ ఐడీ లేదా ఆధార్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి.
 ఆ తర్వాత భూమి వివరాలు సరిచూసుకుని, పంటను, అవసరమైన బస్తాల సంఖ్యను నమోదు చేసి, సమీప దుకాణాన్ని ఎంచుకుంటే క్యూఆర్ కోడ్ జెనరేట్ అవుతుంది.
 వృద్ధులు లేదా నేరుగా దుకాణానికి రాలేని రైతులు తమ తరపున ఎరువులు తీసుకునే 'ప్రతినిధి' వివరాలను కూడా యాప్‌లో నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది.
రైతులు ఆర్ఎస్‌కే వద్దకు లేదా బుకింగ్ సమయానికి ఆధార్ కార్డు, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్, భూమి పాస్‌బుక్ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మరిన్ని సందేహాల నివృత్తి కోసం శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని ఐదు మండలాల వ్యవసాయ అధికారులు  ఎం ఏ ఓ, గ్రామ ఆర్ఎస్‌కే సిబ్బందిని సంప్రదించాలని కోరారు. VC venkataiah సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి