BREAKING
మేయర్ రమేష్ గౌడ్‌ను కలిసిన మున్సిపల్ అధికారులు ఘనంగా స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా స్వామివారి కల్యాణోత్సవం 'సిన్నర్స్' చిత్రానికి అవార్డు.. కృతజ్ఞతలు తెలిపిన మైఖేల్ బీ జోర్డాన్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు కార్తీక పౌర్ణమి వేళ భక్తి పారవశ్యంలో అన్నవరం! ప్లాస్టిక్ సర్జరీ పుకార్లపై జాస్మిన్ భాసిన్ కౌంటర్.. 'నా ముఖం పర్మనెంట్ ఫిల్టర్ కాదు' ఉక్రెయిన్ యుద్ధం, ఆయుధ సహాయంపై జర్మనీ పౌరుల వైఖరిలో కీలక మార్పు.. ఉత్సాహంగా ఎస్కేయూ అంతర్ కళాశాలల పురుషుల క్రికెట్ టోర్నీ రెండో రోజు పోటీలు కోదాడలో భారీ వర్షం. బంగ్లాదేశ్‌లో వేతనాల పెంపు కోసం భగ్గుమన్న గార్మెంట్ కార్మికుల ఆందోళన: ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మద్యం షాపులు బంద్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు చేజారడంపై వీర్ దాస్ ఆవేదన.. జెట్‌ల్యాగ్‌తో వేడుకకు హాజరు క్రీడా పోటీల్లో ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

కోలాహలంగా అద్దంకి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.

Select Suryaa Now
కోలాహలంగా అద్దంకి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం సోమవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కోలాహలంగా జరిగింది. ప్రత్యేక అధికారి రవికుమార్ నూతన మున్సిపల్ చైర్మన్ కాకాని అశోక్‌తో పాటు 32 మంది వార్డు కౌన్సిలర్లచే ప్రమాణస్వీకారం చేయించారు.
ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఈ పదవి కోసం 20వ వార్డు కౌన్సిలర్ రంగశెట్టి సాంబశివరావు తరఫున ఒక్కటే నామినేషన్ (అప్లికేషన్) దాఖలు కావడంతో, ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.
 
అందరి సహకారంతో పట్టణాభివృద్ధి: చైర్మన్ కాకాని అశోక్
ఈ సందర్భంగా నూతన చైర్మన్ కాకాని అశోక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్లు, అధికారులందరి సమన్వయం, సహకారంతో అద్దంకి పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రూ. 45 కోట్లతో అభివృద్ధి పనులు: కమిషనర్ రవీంద్ర
మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ.. ప్రస్తుతం మున్సిపాలిటీలో కొంతమేర నిధుల కొరత ఉన్నప్పటికీ, మరో రెండు మూడు నెలల్లో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక చొరవ, సహకారంతో పట్టణంలోని అన్ని వార్డులలో ఇప్పటికే రూ. 15 కోట్ల విలువైన అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. వీటికి అదనంగా మరో రూ. 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వివిధ వార్డుల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.