కాల్వబుగ్గలో భక్తజన సందోహం!**
**కాల్వబుగ్గలో భక్తజన సందోహం!**
**ఓర్వకల్లు మేజర్ న్యూస్:**
కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా కాల్వబుగ్గలోని శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శివారాధనకు విశేష ప్రాధాన్యం ఉన్న ఈ పవిత్ర దినాన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించడంతో పాటు స్వామివారి పల్లకి సేవను వైభవంగా చేపట్టారు.
ఆలయ ప్రధాన అర్చకులు కళ్యాణ లక్ష్మీనారాయణ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఛైర్మన్ కాటినేని నారాయణ, ఈవో మద్దిలేటి పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేపట్టారు. దర్శన ఏర్పాట్లతో పాటు భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిచ్చినట్లు ఈవో మద్దిలేటి వెల్లడించారు.