నా ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు....!? ** ముఖ్యమంత్రా... జిల్లా మంత్రా...!?
సూర్య, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం లో గత ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ల కన్నా ఒక్క పింఛన్ కూడా ఎక్కువ ఇవ్వలేదని తాను చేసిన ఆరోపణలకు జవాబు రాలేదని, దీనికి జవాబు ముఖ్యమంత్రి ఇస్తారా..!?జిల్లా మంత్రి ఇస్తారా...!? అని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ శివారులోని కేసి క్యాంపులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పెన్షన్లలో వివిధ కారణాలవల్ల 5250 మంది పింఛన్లను అధికారులు తొలగించాలని, కొత్తగా కేవలం 42 21 మందికి మాత్రమే ఇచ్చారని అంటే గతంలో కన్నా 1029 తగ్గాయని అన్నారు. ఈ విషయాన్ని తాను చెబితే సమాధానం చెప్పే పరిస్థితి ఈరోజు వరకు లేదని ఆయన అన్నారు. నా సొంత గ్రామం వీణవంకలో 73 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 28 మందికే పింఛన్లు ఇచ్చారని గతంలో కన్నా చాలా తక్కువ మందికి వచ్చాయని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ కన్నా తక్కువ బడ్జెట్ కేటాయించడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లో దళితులకు పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టం చేయలేదని, దళితులపై కోపం ఈ ప్రభుత్వానికి ఎందుకు తెలియడం లేదని అన్నారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో 45 వేల మందికి వివిధ రకాల పింఛన్లు వచ్చాయని ప్రస్తుతం ప్రభుత్వం అన్నింటిలో కోతలు పెడుతూ తామే ఇచ్చామని ప్రజలను మభ్యపెట్టడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కొడంగల్ కి నిధులు ఇస్తున్నారని తన నియోజకవర్గానికి ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కొడంగల్ కి ముఖ్యమంత్రా...? లేక రాష్ట్రానికి అన్న విషయం ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన ఆరోపణలకు సమాధానం చెప్పాలని, నా ఆరోపణలు తప్పు అని నిరూపిస్తే ఇప్పటికీ రాజీనామా చేయడానికి తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు బండ శ్రీనివాస్ కొలిపాక శ్రీనివాస్ గందె శ్రీనివాస్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు