తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్.
నల్గొండ జిల్లా బ్యూరో మేజర్ న్యూస్... తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలి-జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉన్నందున రైతులు నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ రైతులతో అన్నారు. తక్కువ నీటితో సాగయ్యే, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.సోమవారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో యాసంగి పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల పై రైతులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వరి సాగుపై పూర్తిగా ఆధారపడకుండా ప్రాంతాన్ని బట్టి పెసర, మినుము, శనగ తదితర పంటలను సాగు చేయాలని సూచించారు.తక్కువ కాలంలో చేతికొచ్చే, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చే పంటలను ఎంపిక చేసుకోవాలని అన్నారు.రైతులు వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో చూడాలని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను ముందుగానే గుర్తించి సాగు చేయాలన్నారు.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే దిశగా రైతులు ఆలోచించాలని అన్నారు.
ప్రాంతాన్ని బట్టి పంటల ఎంపికతో పాటు, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.సమావేశంలో రైతులు మాట్లాడుతూ తమ ప్రాంతాల్లో మెట్ట భూములు అధికంగా ఉన్నాయని, సాగుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. డ్రిప్, స్ప్రింక్లర్, సోలార్ ఫెన్సింగ్ తదితర సౌకర్యాలు కల్పిస్తే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతామని తెలిపాఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి శేఖర్ , అధికారులు, రైతులు పాల్గొన్నారు.