BREAKING
దామచర్ల డిజైన్‌లో.. కొత్త ఒంగోలు ప్రారంభ ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా రాయలసీమ జెన్ స్టార్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జాగ్నేష్ కుమార్ రాజీనామా చేయాలి టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు! గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ శాఖకు Q2లో రూ. 369.62 కోట్ల రాబడి; 25 మద్యం షాపులకు నోటిఫికేషన్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ బలిజ కుల బాంధవుల సేవే లక్ష్యంగా నిరంతర కృషి బంగారం షాప్ లో చోరీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీసర్వేలో అలసత్వం సహించేది లేదు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రీసర్వే పురోగతిపై మంత్రి పొంగులేటి అసంతృప్తి నవంబర్ 15లోగా నాణ్యతతో రీసర్వే పూర్తి చేయాలి – అధికారులకు మంత్రి ఆదేశం ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

విద్యార్థుల భవిష్యత్‌కు అండగా వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్

Select Suryaa Now
విద్యార్థుల భవిష్యత్‌కు అండగా వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్

ప్రతిభకు ప్రోత్సాహం.. 48 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యాభ్యాసంలో అండగా నిలిచే లక్ష్యంతో వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్, కడప ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెరిట్ స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ద్వితీయ సంవత్సరం, చివరి సంవత్సరం చదువుతున్న మొత్తం 48 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు సుమారు రూ.2 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లను అందజేశారు. దివంగత వై.వి. నాయుడు కుమారులు వై. వినయ్ కుమార్, డాక్టర్ వై. రామ సంజయ్, కోడలు సి. సునీత, మనుమడు వై. సాయి వేణుగోపాల్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ తండ్రి దివంగత వై.వి. నాయుడు ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా సేవలందించారని గుర్తుచేశారు. ఈ కళాశాలతో తమ కుటుంబానికి ఎంతోకాలంగా అనుబంధం ఉందని తెలిపారు. తమ కుటుంబానికి చెందిన వై. వినయ్ కుమార్ కూడా ఇదే కళాశాలలో పూర్వ విద్యార్థి అని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు విద్యాభ్యాసంలో తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం కొనసాగిస్తామని వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పాలెం గురుమూర్తి రెడ్డి మాట్లాడుతూ, వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు రూ.2 లక్షల విలువైన మెరిట్ స్కాలర్‌షిప్‌లను 48 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వల్ల వారు మరింత ఉత్సాహంతో విద్యలో రాణించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇటువంటి ప్రోత్సాహకాలు విద్యార్థుల ఉన్నత విద్యకు, భవిష్యత్‌లో మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ట్రస్ట్ అందిస్తున్న సహకారానికి కళాశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్థులు, అధ్యాపకులు వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.