బలిజ కుల బాంధవుల సేవే లక్ష్యంగా నిరంతర కృషి
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్:
ప్రొద్దుటూరులో గతంలో ప్రజారాజ్యం పార్టీలో కొనసాగినప్పటి నుంచి ప్రస్తుతం జనసేన పార్టీలోనూ ప్రజలకు, ముఖ్యంగా బలిజ కుల బాంధవులకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అల్లం చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరు కు విచ్చేసిన రాజోలు ఎమ్మెల్యే దేవ ప్రసాద్ ను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు తెలిపారు. గత 35 సంవత్సరాలుగా బలిజ కమిటీ ద్వారా కుల బాంధవులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ అర్హులైన లబ్ధిదారులకు కాపు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. సబ్సిడీ పథకాల ద్వారా పలువురు లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా కమిటీ తరఫున చర్యలు చేపట్టినట్లు వివరించారు. అదేవిధంగా బీసీల హక్కులు, సమస్యలపై ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని సుమారు 200 మందితో కలిసి జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కాపు, బలిజ సామాజిక వర్గాల సమస్యలను జాతీయ స్థాయిలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కాపు బలిజ సంఘంలో జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా, ప్రొద్దుటూరు ఉపాధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ సామాజిక వర్గానికి అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. సామాజిక వర్గ అభివృద్ధి, యువతకు అవకాశాలు, సంక్షేమ పథకాల అమలు, అర్హులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చేయడం వంటి అంశాలపై నిరంతరం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక వర్గ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరినట్లు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ కుల బాంధవుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుంకర మురళీ, అక్కిదాసరి రామారావు, మాదాసు మురళి తదితరులు పాల్గొన్నారు