BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

Select Suryaa Now
చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

 

సౌత్ క్రైమ్ బృందానికి సీపీ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి ప్రశంసలు

గాజువాక, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్ : పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను వేగంగా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో విశేష ప్రతిభ కనబరిచిన సౌత్ సబ్-డివిజన్ క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కాయి. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో సీపీ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి చేతుల మీదుగా సౌత్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ జీడి బాబు, ఎస్సై హరికృష్ణలు ఈ రివార్డులను అందుకున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించడం, పోయిన బంగారాన్ని రికవరీ చేసి బాధితులకు తిరిగి అప్పగించడాన్ని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. క్రైమ్‌ విభాగం సమష్టి కృషితో పనిచేయడం వల్లే తక్కువ సమయంలో మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించడం ద్వారా పోలీసులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని చెప్పారు. మున్ముందు కూడా ఇదే నిబద్ధతతో పనిచేస్తూ నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ లతా మాధురి తదితరులు పాల్గొన్నారు.