BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

Select Suryaa Now
 భూ  రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

భూ రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

సూర్య బ్యూరో ఉమ్మడి వరంగల్, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్,

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూ రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, అధికారులు బాధ్యతాయుతంగా నిర్దేశిత పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి తో కలిసి  జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో భూ రీ సర్వే,
పై ఐ డి ఓ సి సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో భూ రీ సర్వే పనులలో వేగం పెంచాలన్నారు.
క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పర్యవేక్షిస్తూ, కొలతలు, భూ వివరాల నమోదులో పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
భూభారతి, సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా రెవెన్యూ సేవలు అందిస్తూ, భూ సమస్యల పరిష్కారంలో అనవసర జాప్యం లేకుండా చూడాలన్నారు. 
సమావేశంలో ఆర్డీవో కృష్ణవేణి , అన్ని మండలాల తహసిల్దార్ లు, డిప్యూటీ తహసిల్దార్ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.