హిందూ దేవుళ్లను కించపరిస్తే సహించేది లేదు
హిందూ దేవి దేవతలను కించపరిస్తే సహించేది లేదు: బిజెపి జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూక్య జవహర్ నాయక్
కొత్తగూడ సెప్టెంబర్ 30 (మేజర్ న్యూస్ (సూర్య)
కొత్తగూడ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హిందూ దేవి దేవతలను కించపరిచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేశారు తర్వాత రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసులకు బిజెపి నాయకులకు మధ్య తోపులాట జరిగింది ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్య జవహర్ నాయక్ మాట్లాడుతూ ఈ యొక్క దేశంలో హిందువుల దేవీ దేవతలను కించపరుస్తూ మాట్లాడడం పరిపాటిగా మారిందని అది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి తగదు అని ఈ సందర్భంగా హెచ్చరించారు మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే సహించేది లేదని భారతీయ జనతా పార్టీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు అంతేకాకుండా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధనిక దేవుడు రాముడు అని పేద దేవుడు శివుడు అని కించపరుస్తూ మాట్లాడడం దేవుళ్లకు పేద ధనిక అంటూ బేధాప్రాయాలు సృష్టించడం తగదని హెచ్చరించారు.