BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్

Select Suryaa Now
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్

*విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు అదనంగా మరో 100 కేవీఏ డీటీర్*

*ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్*


గీసుగొండ సెప్టెంబర్ మేజర్ న్యూస్ (సూర్య)మండలం మచ్చపూర్ సెక్షన్ అనంతారం గ్రామంలో ఓవర్‌లోడ్‌తో ఉన్న 100 కేవీఏ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం అదనంగా మరో 100 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి బుధవారం ఛార్జ్ చేశారు. విద్యుత్ లోడ్ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో డీఈ బి. దానయ్య, ఏడి ఈ బానోత్ రవినాయక్, ఏఈ సందీప్, లైన్‌మెన్ మల్లికార్జున్, ప్రశాంత్, ఉన్మాన్, కాంట్రాక్టర్ వీరన్న, గ్రామ సర్పంచ్ తాటికాయల సతీష్‌తో పాటు గ్రామ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఈ బి. దానయ్య మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్‌కు సంబంధించిన ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అవగాహన కల్పించారు.అనంతరం గ్రామ సర్పంచ్ తాటికాయల సతీష్ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.