BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి

Select Suryaa Now
తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి

తునిలో నేతల ఆత్మీయ కలయిక

యనమల నివాసంలో తెదేపా ముఖ్య నేతలకు తేనీటి విందు

హాజరైన మంత్రి నారాయణ, సుజయ్‌కృష్ణ రంగారావు

ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల సందడి

ఉమ్మడి గోదావరి జిల్లాల ‘సూర్య’ బ్యూరో, తుని: 

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నివాసం బుధవారం సాయంత్రం తెదేపా ముఖ్య నేతల ఆత్మీయ కలయికకు వేదికైంది. ప్రభుత్వ విప్‌, తుని ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి ఆయన పార్టీ ముఖ్య నేతలకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరై కొద్దిసేపు ముచ్చటించారు.

కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పి.నారాయణ, జిల్లా ఎన్నికల పరిశీలకులు, జోన్‌ కోఆర్డినేటర్‌ సుజయ్‌కృష్ణ రంగారావు హాజరయ్యారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు), వరుపుల సత్యప్రభ, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్‌, కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు.

పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ, కాకినాడ రూరల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, కాకినాడ పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్‌బాబా తదితరులు పాల్గొన్నారు.