BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్

Select Suryaa Now
బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్

బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్

టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.. అనుమతులు లేని తవ్వకాలపై కఠిన చర్యలు

మచిలీపట్నం, సెప్టెంబరు 30, మేజర్ న్యూస్ : బందరు పోర్టు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, పోర్టు విస్తరణకు కేటాయించిన భూముల్లో అక్రమ మైనింగ్‌, అనధికారిక మట్టి తవ్వకాలను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌, ముడా శాఖల అధికారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు బందరు ఆర్డీఓ సాంబశివరావు తెలిపారు. బుధవారం పోర్టు పరిసరాల్లోని ప్రభుత్వ, కేటాయించిన భూములను టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు సంయుక్తంగా పరిశీలించి, అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయా అనే అంశంపై ఆరా తీశారు. పోర్టు రెండో దశ విస్తరణలో భాగంగా ప్రభుత్వం సుమారు 1,400 ఎకరాల భూమిని కేటాయించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు ఆర్డీఓ తెలిపారు. అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, మట్టి తరలించే వాహనాల రాకపోకలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా మైనింగ్‌, మట్టి తవ్వకాలు లేదా అక్రమ రవాణాకు పాల్పడితే వాహనాలను సీజ్‌ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన సమాచారం ఉంటే మచిలీపట్నం ఆర్డీఓ 9849903962 నంబరుకు తెలియజేయాలని ప్రజలను కోరారు. తనిఖీల్లో డీఎస్పీ, గనుల శాఖ సహాయ సంచాలకులు, సీఐ, ఎస్‌ఐ, తహసీల్దార్‌, ముడా, రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.