పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష
పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష
విజయవాడ క్రైం, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ (ప్రేమ్ రాజ్) : విధుల్లో మృతి చెందిన, పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బంది కుటుంబాల సమస్యల పరిష్కారానికి అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు సంక్షేమ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ ప్రయోజనాలు, జీపీఎఫ్, సెలవుల నగదీకరణ, బీమా, పెన్షన్, పెండింగ్ బిల్లులు, కార్పస్ ఫండ్, కారుణ్య నియామకం తదితర ప్రయోజనాలు అందని వారు తమ సమస్యలను డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న డీసీపీ, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పోలీసుల సంక్షేమానికి కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో 84 మంది రిటైర్డ్ పోలీసు అధికారులు, సిబ్బంది, మృతి చెందిన పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.