యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి
యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి
ఉయ్యూరు, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ (ప్రేమ్ రాజ్) : చింతలతోట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక ఉత్సవాల తుదిఘట్టమైన నిమజ్జన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని గణేశుడికి పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు కనుక అదే స్ఫూర్తితో కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే బాధ్యతను యువత తీసుకోవాలని కోరారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, ఐక్యంగా ముందుకు సాగాలని, మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండడంతో పాటు చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో జంపాన శివయ్య, రాజులపాటి ఫణి, జంపాన రుద్రయ్య, మురాలయ్య, ఆరేపల్లి నాగరాజు, జంపాన తేజ తదితరులు పాల్గొన్నారు.