BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు

Select Suryaa Now
సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు

సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు

క్వార్టర్‌ఫైనల్‌కు బెర్తులు ఖరారు

విజయవాడ స్పోర్ట్స్, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ (ప్రేమ్ రాజ్) : సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో రోజు లీగ్‌ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. బాలికల విభాగంలో మహారాష్ట్ర 103–45తో కేరళపై ఘన విజయం సాధించి గ్రూప్‌-బిలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంది. బాలుర విభాగంలో రాజస్థాన్ 73–71తో ఉత్తరప్రదేశ్‌పై రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించగా, ఢిల్లీ 72–29తో కర్ణాటకను ఓడించింది. బాలికల విభాగంలో తమిళనాడు 62–17తో తెలంగాణపై గెలిచింది. రెండో స్థాయి బాలుర విభాగంలో తెలంగాణ 107–29తో గోవాపై, ఛత్తీస్‌గఢ్‌ 82–19తో తమిళనాడుపై, పశ్చిమబెంగాల్‌ 100–29తో చండీగఢ్‌పై, కేరళ 76–17తో పుదుచ్చేరిపై విజయం సాధించాయి. క్వార్టర్‌ఫైనల్‌ నాకౌట్‌ దశకు బాలుర గ్రూప్‌-ఎ నుంచి ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, గ్రూప్‌-బి నుంచి కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర జట్లు, బాలికల గ్రూప్‌-ఎ నుంచి కర్ణాటక, తమిళనాడు, గ్రూప్‌-బి నుంచి మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. గురువారం చివరి రోజు లీగ్‌ పోటీల అనంతరం మిగిలిన బెర్తులు ఖరారు కానున్నాయి.