BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

అంగన్ వాడి, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయం

Select Suryaa Now
అంగన్ వాడి, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయం

అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయం

-డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

-చిన్నారుల ఆరోగ్యం, మహిళల సంక్షేమంలో కీలక పాత్ర

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా సిబ్బందికి ఘన సన్మానం

నర్సంపేట సెప్టెంబర్ 30,సూర్య (మేజర్ న్యూస్ )

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా నర్సంపేటలోని  అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.అంగన్ మీలాన్ నర్సంపేట కన్వీనర్ సూత్రపు సరిత  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా ఇంచార్జీ సిరికొండ కవిత, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు టేకుమట్ల రేణుక,జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పిరాల శైలశ్రీ, ఉపాధ్యక్షురాలు శోభ, మార్తా ఉషారాణి బీజేపీ ఫ్లోర్ లీడర్ జూలూరి రోజా రాణి, కళ్యాణి, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నర్సంపేట ఎంపీడీఓ ఆఫీసులో అంగన్‌వాడీ టీచర్లు, ఆయా వర్కర్లు, ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలను అభినందిస్తూ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి  శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం, ప్రాథమిక విద్య, గర్భిణులు, బాలింతల సంక్షేమం కోసం అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు నిరంతరం అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రజల ఆరోగ్యం, పోషకాహారం, చిన్నారుల సంరక్షణలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సేవలను ప్రధాని నరేంద్ర మోదీ తరఫున అభినందిస్తూ వారిని గౌరవించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, పోషకాహార కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లలకు చిన్న వయసు నుంచే సరైన పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించవచ్చని తెలిపారు.దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఆర్థిక సహాయం, పోషకాహార కార్యక్రమాలకు మద్దతు, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తూ కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.ప్రజల ఆరోగ్యం, మహిళా సంక్షేమం, బాలల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయా వర్కర్లు, ఆశా కార్యకర్తలను గౌరవించడం ద్వారా వారి సేవలను సమాజం గుర్తిస్తున్నదని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయా వర్కర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.