BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

అమ్మవారి శరన్నవ రాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన

Select Suryaa Now
అమ్మవారి శరన్నవ రాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన

అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన

హనుమకొండ, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ సూర్య,

హనుమకొండలోని ప్రముఖ శైవక్షేత్రం వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న ఏర్పాట్లను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  బుధవారం పరిశీలించారు.
ప్రతి సంవత్సరం సొంత ఖర్చులతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా అమ్మవారి పూజా వేదిక, అలంకరణలు, భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఆలయం కావడంతో, ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సంబంధిత పురావస్తు శాఖ అధికారులకు తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలకు అవసరమైన అనుమతులు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు.
శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు, నిర్వాహకులకు సూచించారు.
ఎమ్మెల్యే  వెంట  పిసిసి మెంబెర్ బత్తిని శ్రీనివాస్ రావు,తోట పవన్ ,శ్రీకర్,రవీందర్ రెడ్డి ,కుమార్ యాదవ్,రాజు,సతీష్ మరియు అధికారులు ఉన్నారు.