BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

పేదవాడి ఆత్మగౌరవానికి ‘పట్టా’భిషేకం!

Select Suryaa Now
పేదవాడి ఆత్మగౌరవానికి ‘పట్టా’భిషేకం!

 

దశాబ్దాల నిరీక్షణకు తెర.. పేదల సొంతింటి కల సాకారం

గాజువాకలో 2,568, పెదగంట్యాడలో 1,910 నివాస పట్టాల పంపిణీ

కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి: కార్పొరేషన్ ఎన్నికల్లో ఆశీర్వదించాలన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

గాజువాక, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్ : ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివాసాలు ఏర్పాటు చేసుకుని సరైన యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు లేక నిత్యం ఆందోళనతో గడిపిన గాజువాక, పెదగంట్యాడ ప్రాంత నిరుపేదల దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేరుస్తూ.. అర్హులైన పేదలందరికీ శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తూ పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో గాజువాక క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గాజువాక మండల పరిధిలోని 2,568 మంది లబ్ధిదారులకు, అలాగే పెదగంట్యాడ పరిధిలోని 64, 65, 74, 75 వార్డులకు చెందిన 1,910 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా అధికారికంగా నివాస పట్టాలు అందజేశారు. పట్టాలు అందుకున్న వేలాది కుటుంబాల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది.

​ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జీవో నంబర్ 45, 30 హౌస్ కమిటీ పరిధిలోని భూముల్లో వేలాది కుటుంబాలు గృహాలు నిర్మించుకుని జీవిస్తున్నప్పటికీ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల యాజమాన్య హక్కు పత్రాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. "సొంతిల్లు ఉన్నప్పటికీ బ్యాంకు రుణాలు అందక, అత్యవసర సమయాల్లో ఇళ్లను విక్రయించుకోలేక, ఆస్తిపై స్పష్టమైన యాజమాన్య హక్కుల్లేక పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు సైతం చేయించలేక వేలాది మంది పేదలు మానసిక క్షోభ అనుభవించారు. ఎన్నికల సమయంలో వారి కష్టాలను స్వయంగా చూసి చలించిపోయాం. ఇచ్చిన మాటకు కట్టుబడి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిబంధనలు సులభతరం చేసి నేడు వేలాది కుటుంబాలకు పూర్తి యాజమాన్య హక్కులతో కూడిన పట్టాలు అందించి వారి జీవితాల్లో స్థిరత్వం నింపాం" అని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలని, రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి గాజువాక సమగ్రాభివృద్ధికి సంపూర్ణ మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కల్యాణ చక్రవర్తి, గాజువాక తహసీల్దార్ త్రినాధ్, పెదగంట్యాడ తహసీల్దార్ అమల, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) మృదుల పాల్గొని లబ్ధిదారుల జాబితాలను పరిశీలించి, పట్టాల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన లబ్ధిదారులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు.