BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు

Select Suryaa Now
భారత ఆర్కిటిక్ యాత్రలో  గీతం పరిశోధకుడు

  
          విశాఖ ఎడ్యుకేషన్,సెప్టెంబర్ 29 మేజర్ న్యూస్ : భారత ప్రభుత్వ  కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా ఆర్కిటిక్ హిమఖండం ప్రాంతంలో ఈ ఏడాది చేపట్టిన  పరిశోధన ప్రాజెక్టు లో  గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్  సైన్స్ రసాయన శాస్త్ర విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మనోజ్ పి.రాయరోత్ తన అధ్యయనాలను పూర్తి చేసుకుని విజయవంతంగా నగరానికి తిరిగి వచ్చారు. నార్వేలోని స్వాల్‌బర్ట్, న్యా అలేసుండ్ లో 2008 లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన చారిత్రాత్మక హిమాద్రి పరిశోధనా కేంద్రంలో భారతీయ ఆర్కిటిక్ యాత్ర 2026`27(బ్యాచ్`4) లో భాగంగా డాక్టర్ మనోజ్ నేషనల్ సెంటర్ ఫర్ సోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ మరియు ఎకోలాజికల్, ప్రెసిడెన్స్ యÖనివర్సిటీ వంటి భారతదేశంలోని అగ్రగామి సంస్థలకు చెందిన శాస్త్రవేత్తల బృందంతో కలిసి ఈ అధ్యయన యాత్రను పూర్తి చేశారు. 
        అత్యల్ప ఉష్ణోగ్రతలు, గ్లేసియర్ మంచు కరిగే నీరు మరియు నిరంతర సూర్య కాంతి వంటి తీవ్రమైన ద్రువ పరిస్థితులలో సేంద్రీయ కాలుష్య కారకాలు ఎలా ప్రవర్తిస్తాయి మరియు రూపాంతరం చెందుతాయి అనే అంశాన్ని పరిశోధించడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం “వాతావరణ మార్పులు ప్రభావం వల్ల ఆర్కిటిక్ మంచు నుండి సముద్ర జలాల్లోకి విడుదలయ్యే ఉద్బవిస్తున్న కాలుష్య కారకాల పరివర్తన మరియు వాటి పరివర్తనా మార్గాల పరిశీలన” పేరిట  ప్రతిపాధించిన పరిశోధనలో భాగంగా డాక్టర్ మనోజ్ ఈ అధ్యయన యాత్ర జరిపారు. 
    తన  యాత్రలో భాగంగా డాక్టర్ మనోజ్ ఆర్కిటిక్ లోని న్యా`అలేసుండ్ లో విస్తృతంగా క్షేత్ర అధ్యయనంలో నీటి  కీలకమైన పర్యావరణ నమÖనాలను సేకరించారు. అలాగే  ఆర్కిటిక్ లోని భారత ప్రభుత్వ హిమాద్రి మెరైన్ ల్యాబోరేటరీలో ప్రాధóమిక విశ్లేషణలను పూర్తి చేశారు. ఇతర నమÖనాలు గీతంలోని అత్యాధునిక అనలిటికల్ పరిశోధనా కేంద్రాలలో సమగ్ర పరిశోధనకు తీసుకువస్తున్నట్లు తెలిపారు.  
     ఈ సందర్భంగా మంగళవారం తేది: 29`09`2026న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో  డాక్టర్ మనోజ్ స్పందిస్తూ ఆర్కిటిక్‌లో గీతం విశ్వవిద్యాలయానికి ప్రాతినిద్యం వహించడం మరియు మంచు తుఫానులు, గడ్డకట్టే గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వివిధ రంగాల నిపుణులతో కలిసి పనిచేయడం అపూరమైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశోధన ఆర్కిటిక్‌లోని కాలుష్య కారకాలు మరియు పర్యావరణ మార్పులను అర్ధం చేసుకోవడానికి అలాగే అంతర్జాతీయ ద్రువ సైన్స్‌లో భారతదేశ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. 
      ఈ సందర్భంగా గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డైరక్టర్ ప్రొఫెసర్ చందు కవిత డాక్టర్ మనోజ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. యువ పరిశోధకులను ప్రోత్సహించడానికి మరియు ప్రేరేపించడానికి భవిష్యత్తులో స్కూల్ ఆఫ్ సైన్స్ నుండి విద్యార్ధులను కూడా ఇటువంటి జాతీయ పరిశోధనా ప్రాజెక్టులకు పంపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో సహ పరిశోధకుడుగా ఉన్న రసాయనశాస్త్ర  విభాగం అధిపతి ప్రొఫెసర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఆర్కిటిక్ ప్రాంతంలో డాక్టర్ మనోజ్ సేకరించిన నీటి నమÖనాలను  అధ్యయనం చేయడానికి విశ్వవిద్యాలయంలో ఉన్నత స్థాయి పరిశోధనా ప్రయోగశాలలను   ఉపయోగించనున్నట్లు తెలిపారు. వివిధ విభాగాల సమన్వయంతో ఈ అధ్యయనాలను నిర్వహించి ప్రభుత్వానికి తుది నివేధిక అందజేస్తామన్నారు.