BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..!

Select Suryaa Now
గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..!


-- ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు 
ఆనందపురం:29సెప్టెంబర్ మేజర్ న్యూస్

ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే గుండె జబ్బులకు గురై మరణాలు సంభవిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆనందపురం ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు సూచించారు.
ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేములవలస జోనల్ కార్యాలయం వద్ద మదర్ తెరిసా విగ్రహానికి పూలమాల వేసి ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పాపారావు మాట్లాడుతూ జంక్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని, మద్యం, గుట్కా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి మాట్లాడుతూ గుండె జబ్బుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు.
కార్యక్రమంలో జోనల్ సలహాదారు కోన ప్రకాష్, కోశాధికారి పచ్చిపులుసు కనకారావు, ఆనందపురం మండల అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరావు, విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు పడాల కోటేశ్వరరావు, ప్రచార కార్యదర్శి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.