BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

స్థానిక సమరానికి వైకాపా సమరశంఖం : మళ్ళా విజయప్రసాద్ దిశానిర్దేశం

Select Suryaa Now
స్థానిక సమరానికి వైకాపా సమరశంఖం : మళ్ళా విజయప్రసాద్ దిశానిర్దేశం

 

సింధియా, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులన్నీ పూర్తి సమన్వయం, ఐక్యతతో ముందుకు సాగి, విజయమే ఏకైక లక్ష్యంగా బూత్ స్థాయి నుంచే పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగాలని మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ళా విజయప్రసాద్ 
పిలుపునిచ్చారు. మంగళవారం మింది గ్రామంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా మళ్ళా విజయప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో నేతలు, కార్యకర్తలంతా ఒకే కుటుంబంలా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్టానం ఏ అభ్యర్థికి అవకాశం కల్పించినా, వ్యక్తిగత అభిప్రాయాలు, ఆశలను పక్కన పెట్టి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని స్పష్టం చేశారు. ఏ వార్డు నుండి ఎవరు పోటీ చేస్తారనే అంశాలపై ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా, పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాలని అందుకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అద్భుత పరిపాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, వార్డు స్థాయి సమావేశాల ద్వారా కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, క్రియాశీలక సభ్యుల వివరాలను సిద్ధం చేసుకోవడంతో పాటు, మారిన వార్డు పరిధులు, పోలింగ్ కేంద్రాలకు అనుగుణంగా బూత్ కమిటీలను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు పి.వి సురేష్, బల్ల లక్ష్మణరావు, గుండపు నాగేశ్వరరావు, పిల్లా కన్నబాబు, చెంగల వెంకటలక్ష్మి, పలువురు వార్డు అధ్యక్షులు, పార్టీ పరిశీలకులు, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.