బంగారం షాప్ లో చోరీ
పరవాడ ,సెప్టెంబర్ 28 ,మేజర్ న్యూస్.
మండలంలో గల వాడచీపురుపల్లి జంక్షన్ సమీపంలోని చాందిని జువెలరీ వర్క్‌షాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గుర్తుతెలియని దొంగలు షాప్ షట్టర్‌ను తెరిచి, లోపల ఉన్న సుమారు 195 గ్రాముల వెండి వస్తువులను చోరీ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించిన షాపు యజమాని పెదపాటి నూకరాజు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా సీఐ ఎల్. భాస్కర్ రావు సంఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్ మరియు క్రైమ్ టీమ్ సిబ్బందితో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను సేకరించి, చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.