BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్వతీపురం మండలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృత స్థాయి సమావేశం పల్లె పండుగతో రాష్ట్ర ప్రగతికి సరికొత్త ఊతం అల్యూమినియం అభివృద్ధియే లక్ష్యం భారతదేశపు తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతాం ఒడిశా మైనింగ్ సామర్థ్యం, బెంగాల్ వ్యాపార సామర్థ్యంతో బలమైన అల్యూమినియం వ్యాల్యూ చైన్ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అల్యూమినియం ఉత్పత్తితో పాటు.. విలువ ఆధారిత వ్యవస్థగా మార్చడం లక్ష డంపింగ్‌ యార్డు తరలించాలి సబ్సిడీ రుణాల పేరుతో మోసం చేశారంటూ ఎస్పీకి ఫిర్యాదు దామచర్ల డిజైన్‌లో.. కొత్త ఒంగోలు ప్రారంభ ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా రాయలసీమ జెన్ స్టార్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జాగ్నేష్ కుమార్ రాజీనామా చేయాలి టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు! గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ శాఖకు Q2లో రూ. 369.62 కోట్ల రాబడి; 25 మద్యం షాపులకు నోటిఫికేషన్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ

గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్

Select Suryaa Now
గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్


అనకాపల్లి ప్రతినిధి, సెప్టెంబరు28, :  జిల్లాలో అన్ని మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేలా సమన్వయంతో అధికారులు పనిచేయాలని,  జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ నుంచి మండల అభివృద్ధి అధికారులు, ఉప మండల అభివృద్ధి అధికారులు, గ్రామీణ నీటి సరఫరా శాఖ,  అగ్రికల్చర్, విద్యుత్ శాఖ, డి ఆర్ డి ఎ, డిపిఓ, ఇరిగేషన్ అధికారులతో  జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా  మండలాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, తాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాల నిర్వహణ, గ్రామాల్లో చేపడుతున్న పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్  సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మండల అధికారులు రేపు (మంగళవారం)పి.జి.ఆర్.ఎస్  వినతుల పరిష్కారానికి క్షేత్రస్థాయి సందర్శన చేయాలన్నారు. అధికారులందరూ తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి.  వ్యవసాయ రంగానికి సంబంధించి ఏవో, నీటిపారుదల రంగానికి ఏ ఈ AE, పారిశుధ్యానికి  డిప్యూటీ ఎంపీడీవో, తాగునీటి విభాగానికి  ఏఈ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈరోజు పి జి ఆర్ ఎస్ లో వచ్చిన 280 వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 
గ్రామీణాభివృద్ధి కోసం ప్రతి ఊరు, మండలం మరియు నియోజకవర్గంలో రూ. 200 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులను స్పష్టంగా హైలైట్ చేయాలని తెలిపారు.  ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమం  చూసుకోవాలి. రోడ్డు భద్రత చర్యలు సహా పలు కీలక అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా పనులను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్ల కూడళ్ల వద్ద, మలుపుల వద్ద వైర్‌లెస్ లైట్ల ఏర్పాటుకు సంబంధించి ఈమరియు పి ఆర్ అధికారులతో అంచనాలు సిద్ధం చేయాలన్నారు.  మండల పరిషత్ నిధుల ద్వారా అవసరమైన చోట్ల సైన్‌బోర్డులు , జీబ్రా క్రాసింగ్‌లు  మరియు స్పీడ్ బ్రేకర్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు.ఈ సమావేశంలో  కలెక్టరేట్ నుంచి  డిపిఓ, డ్వామా పిడి, ఆర్ డబ్ల్యూ ఎస్., ఎస్ఈ, డిఆర్డిఏ, ఇరిగేషన్, విద్యుత్ శాఖ,  ఆర్ అండ్ బి, తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.