BREAKING
వైసీపీ కార్యాలయంలో సీనియర్ నాయకులకు సన్మానం సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యం అధిష్ఠాన ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు పనిచేయాలి మేడ్చల్ జిల్లాలో నక్షబాట అలైన్‌మెంట్ మార్పుపై గ్రామస్తుల ఆగ్రహం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్వతీపురం మండలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృత స్థాయి సమావేశం పల్లె పండుగతో రాష్ట్ర ప్రగతికి సరికొత్త ఊతం అల్యూమినియం అభివృద్ధియే లక్ష్యం భారతదేశపు తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతాం ఒడిశా మైనింగ్ సామర్థ్యం, బెంగాల్ వ్యాపార సామర్థ్యంతో బలమైన అల్యూమినియం వ్యాల్యూ చైన్ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అల్యూమినియం ఉత్పత్తితో పాటు.. విలువ ఆధారిత వ్యవస్థగా మార్చడం లక్ష డంపింగ్‌ యార్డు తరలించాలి సబ్సిడీ రుణాల పేరుతో మోసం చేశారంటూ ఎస్పీకి ఫిర్యాదు దామచర్ల డిజైన్‌లో.. కొత్త ఒంగోలు ప్రారంభ ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా రాయలసీమ జెన్ స్టార్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జాగ్నేష్ కుమార్ రాజీనామా చేయాలి టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు!

సబ్సిడీ రుణాల పేరుతో మోసం చేశారంటూ ఎస్పీకి ఫిర్యాదు

Select Suryaa Now
సబ్సిడీ రుణాల పేరుతో మోసం చేశారంటూ ఎస్పీకి ఫిర్యాదు

సబ్సిడీ రుణాల పేరుతో మోసం చేశారంటూ ఎస్పీకి ఫిర్యాదు

లోన్లు ఇప్పిస్తామని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేశారంటూ బాధితుల ఆరోపణలు

రెండేళ్లుగా తిరుగుతున్నా డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు

మదనపల్లె, అన్నమయ్య జిల్లా:

సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని నమ్మించి తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ తిరుపతికి చెందిన పలువురు మహిళలు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)లో బాధితులు తమ ఫిర్యాదును సమర్పించారు.

బాధితుల ఆరోపణల ప్రకారం.. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన ఆవుల కవిత సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని నమ్మించి తిరుపతిలోని శ్రీపురం కాలనీ, కొర్లగుంట ప్రాంతాలకు చెందిన మహిళల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ విధంగా సుమారు రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు.

రుణాలు ఇప్పిస్తామని చెప్పి రెండేళ్లుగా తిప్పుకుంటున్నారని, తాము ఫోన్‌పే ద్వారా చెల్లించిన డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు నాగరత్న, వరలక్ష్మి తదితరులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పలుమార్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా స్పందన లేకపోవడంతో చివరకు జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్లు తెలిపారు.

తమ నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పించి, ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధిత మహిళలు ఎస్పీని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.