BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్వతీపురం మండలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృత స్థాయి సమావేశం

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్వతీపురం మండలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృత స్థాయి సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్వతీపురం మండలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృత స్థాయి సమావేశం .

పార్వతిపురం, మేజర్ న్యూస్ :
రాష్ట్ర వైసిపి అధినేత మాజీ సీఎం  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు పార్వతీపురం నియోజకవర్గం, పార్వతీపురం మండలం, వెంకంపేట పంచాయతీలో వైసిపి మండల స్థాయి సమావేశం సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగినది. రాబోయే స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు  పిలుపు ఇవ్వడం జరిగినది. ​ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ​కార్యకర్తలే పార్టీకి మూలస్థంబాలు అని, పార్టీకి కార్యకర్తలే అసలైన బలం అని,  క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి గొంతుకగా నిలవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ, మండల స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటికీ వివరించాలని కోరారు.
​ఐక్యమత్యమే విజయం నాయకులు, కార్యకర్తలు విభేదాలు వీడి సమష్టిగా పనిచేసి నియోజకవర్గంలో పార్టీ విజయకేతనం ఎగరేసేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.సమావేశం అనంతరం మండల పరిధిలో గల ప్రతీ గ్రామం స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు గల పార్టీ శ్రేణులు అందరికీ పార్టీ గుర్తింపు కార్డులను మావుడి శ్రీనివాసరావు . మండల నాయకుల సమక్షంలో ఆయన కార్యకర్తలకు పంపిణీ చేయడం జరిగినది.​ ఈ సమావేశంలో పార్వతీపురం మండలం పరిధిలో గల తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులను అందరినీ ఘనంగా సత్కరించి సన్మానించడం జరిగినది. ఈ సమావేశంలో పార్వతీపురం మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.