BREAKING
వైసీపీ కార్యాలయంలో సీనియర్ నాయకులకు సన్మానం సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యం అధిష్ఠాన ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు పనిచేయాలి మేడ్చల్ జిల్లాలో నక్షబాట అలైన్‌మెంట్ మార్పుపై గ్రామస్తుల ఆగ్రహం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్వతీపురం మండలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృత స్థాయి సమావేశం పల్లె పండుగతో రాష్ట్ర ప్రగతికి సరికొత్త ఊతం అల్యూమినియం అభివృద్ధియే లక్ష్యం భారతదేశపు తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతాం ఒడిశా మైనింగ్ సామర్థ్యం, బెంగాల్ వ్యాపార సామర్థ్యంతో బలమైన అల్యూమినియం వ్యాల్యూ చైన్ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అల్యూమినియం ఉత్పత్తితో పాటు.. విలువ ఆధారిత వ్యవస్థగా మార్చడం లక్ష డంపింగ్‌ యార్డు తరలించాలి సబ్సిడీ రుణాల పేరుతో మోసం చేశారంటూ ఎస్పీకి ఫిర్యాదు దామచర్ల డిజైన్‌లో.. కొత్త ఒంగోలు ప్రారంభ ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా రాయలసీమ జెన్ స్టార్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జాగ్నేష్ కుమార్ రాజీనామా చేయాలి టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు!

డంపింగ్‌ యార్డు తరలించాలి

Select Suryaa Now
డంపింగ్‌ యార్డు తరలించాలి

సీసీ రోడ్లకు నిధులు కేటాయించాలి.. ఉప్పల్‌ జోనల్‌ కమిషనర్‌కు మాజీ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి వినతి

ఘట్‌కేసర్‌ రూరల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 28) : ఘట్‌కేసర్‌ సర్కిల్ పోచారం డివిజన్‌ పరిధిలోని అన్నోజిగూడ డంపింగ్‌ యార్డును తరలించాలని, చౌదరిగూడ పరిధిలోని పలు కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి సోమవారం ఉప్పల్‌ జోనల్‌ కమిషనర్‌ రాధిక గుప్తాకు వినతిపత్రం అందజేశారు. అన్నోజిగూడ డంపింగ్‌ యార్డు వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దానిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే చౌదరిగూడ పరిధిలోని హిమగిరి కాలనీ, కాకతీయ నగర్, సాయినగర్, డాక్టర్స్‌ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, ఎంఎల్‌ఆర్‌ కాలనీ, వెంకటసాయి కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోచారం డివిజన్‌లో నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి అదనపు నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్‌ ఆకిటి బాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రాములు, పోచిరెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ లంబ రాజు.