వైసీపీ కార్యాలయంలో సీనియర్ నాయకులకు సన్మానం
రైల్వే కోడూరు: ఇటీవలే నూతనంగా వైయస్సార్ సిపి అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధిగా దవల రమణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొండూరు శివకుమార్ రాజు, సోషల్ మీడియా డిస్టిక్ సెక్రటరీగా, లక్కిరెడ్డి రాజారెడ్డి గార్లు నియమితులైన సందర్భంగా తమపై నమ్మకంతో జిల్లా విభాగాల్లో చోటు కల్పించినందుకు, మరింత చురుగ్గా పనిచేస్తూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా 2029లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియచేస్తు ఈరోజు మధ్యాహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు *వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు గారికి మరియు సీనియర్ నాయకులు పంజం వేణుగోపాల్ రెడ్డి గారికి* శాలువాతో సత్కరించి పూలమాలవేసి కృతజ్ఞతలు తెలియజేసిన నూతన కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో స్టేట్ ఎస్సీ సెల్ కార్యదర్శి తుమ్మల సురేష్, ఎక్స్ ఎంపీపీ కనుపర్తి ఈశ్వరయ్య, జడ్పిటిసి రత్నమ్మ, డిస్ట్రిక్ట్ యూత్ సెక్రటరీ డం రఘు, డిస్టిక్ యూత్ జనరల్ సెక్రెటరీ రాజా (గని) మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు, ఎంపీటీసీ బండారు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు