చిన్నారులకు ఎమ్మెల్యే కావ్య ఆశీస్సులు
చిన్నారులకు ఎమ్మెల్యే కావ్య ఆశీస్సులు
బిట్రగుంట, మేజర్ న్యూస్:
మండల కేంద్రం అయిన బోగోలు కు చెందిన ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు బోగిరి ప్రభాకర్, రాజకుమారి దంపతుల పిల్లలు ఆకర్ష్, ఆశ్చర్య మణిల జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే స్వయంగా కేక్ కటింగ్ నిర్వహించి, చిన్నారులు లకు కేక్ తినిపించారు. అనంతరం చిన్నారులపై అక్షింతలు వేసి, దీర్ఘాయుష్షు తో పాటు, ఉజ్వల భవిష్యత్తు లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.కార్యకర్తలు, నాయకుల ఇంట్లో జరిగే ప్రతీ శుభకార్యానికి హాజరవుతూ వారి కుటుంబంలో ఒకరిగా నిలిచే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రాకతో బోగిరి ప్రభాకర్ కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, అభిమానులు పాల్గొని చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.