రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు---*మంత్రి నారాయణ
* రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు
.
సామాన్యుడిలా మంత్రి నారాయణ
* టీ కొట్టు వద్ద కబుర్లు.. పేదలతో కలసి టిఫిన్.. నెల్లూరులో పీక్స్ చేరిన నారాయణ మార్క్ అభిమానం
* ప్రజల కష్టాలెరిగిన నేత.. 53, 54 డివిజన్లలో మంత్రి నారాయణ పర్యటన
నెల్లూరు,మేజర్ న్యూస్:అధికార హోదాను, ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రి నారాయణ నెల్లూరు నగరంలోని 53, 54వ డివిజన్లలో జరిపిన పర్యటన ఘనంగా సాగింది. నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడిగా తన మార్కును మరోసారి చాటుకున్న మంత్రి, కార్ దిగి నేరుగా వీధుల్లోకి వచ్చి సామాన్య ప్రజల్లో ఒకడిగా కలిసిపోయారు. ఒక చిన్న టీ కొట్టు వద్ద ఆగి స్థానికులతో కరచాలనం చేస్తూ, సరదాగా ముచ్చటిస్తూ టీ తాగిన తీరు స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.
అక్కడితో ఆగకుండా, నగర వీధుల్లో కాలినడకన తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఒక సాధారణ టిఫిన్ సెంటర్‌కు వెళ్లి, పేద ప్రజల పక్కనే కూర్చుని ఎంతో ఆప్యాయంగా అల్పాహారం చేశారు. 53వ డివిజన్‌లో టెంకాయలు అమ్ముకునే ఒక మహిళ వద్ద బండి ఆపి,వ్యాపారం ఎలా జరుగుతుందమ్మా? కుటుంబం సౌఖ్యమేనా? అని ఆత్మీయంగా పలకరించి, ఆమె కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.ఏ చిన్న ఆర్భాటం లేకుండా, ఒక కన్నతండ్రిలా, ఇంటి పెద్దలా ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలను ఆలకించిన మంత్రి నారాయణ ఉదారతపై నెల్లూరు ప్రజలు తీవ్రంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు.. మన మంత్రి నారాయణ అంటూ స్థానికులు జేజేలు పలుకుతున్నారు.