BREAKING
నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్.ఎల్.సి) కార్యక్రమం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ సేవలు మరింత విస్తరణ : మంత్రి సత్యకుమార్ యాదవ్ రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు---*మంత్రి నారాయణ నెల్లూరు, రవితేజ బ్యూరో, మేజర్ న్యూస్: పేదలకు సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయానిధి 85 శాతం రాయితీతో పశుబీమా పశుపోషకులకు అండగా నూతన పశుబీమా పథకం చిత్తూరు జిల్లాలో మళ్లీ ఏనుగుల సంచారం చిన్నారులకు ఎమ్మెల్యే కావ్య ఆశీస్సులు విద్యార్థులతో ఎంపీ వేమిరెడ్డి ముఖాముఖి: ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఏరియా వైద్యశాలలో 'సేవా సంకల్ప అభియాన్': ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య. ఉదయగిరి నియోజకవర్గ వెనుకబాటు ను సీయం కు వివరించండి నేపాల్‌లో జలవిలయం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం ఏఐ దూకుడుకు కళ్లెం వేసే సరికొత్త టూల్‌ను ఆవిష్కరించిన ఎన్విడియా వైసీపీ కార్యాలయంలో సీనియర్ నాయకులకు సన్మానం

ఏరియా వైద్యశాలలో 'సేవా సంకల్ప అభియాన్': ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య.

Select Suryaa Now
ఏరియా వైద్యశాలలో 'సేవా సంకల్ప అభియాన్': ముఖ్యఅతిథిగా పాల్గొన్న  ఎమ్మెల్యే కావ్య.

ఏరియా వైద్యశాలలో 'సేవా సంకల్ప అభియాన్': ముఖ్యఅతిథిగా పాల్గొన్న  ఎమ్మెల్యే కావ్య.

​కావలి మేజర్ న్యూస్:
కావలి ఏరియా వైద్యశాలలో 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన మెగా మెడికల్ అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యురాలు కావ్య కృష్ణారెడ్డికి ఆస్పత్రి సూపరింటెండెంట్, అభివృద్ధి కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘన స్వాగతం పలికారు.
​బ్లడ్ బ్యాంక్ విభాగంలో రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రక్తదానం చేసిన వారిని స్వయంగా పలకరించి ప్రాణదాతలుగా నిలిచినందుకు అభినందించారు. అనంతరం ఆస్పత్రిలోని పలు విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్యం ధ్యేయంగా సేవా సంకల్ప అభియాన్ ద్వారా ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కావలి ఏరియా హాస్పిటల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, అధునాతన వసతులతో ప్రతీ పేదవాడికి నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులు, సిబ్బంది, కూటమి నేతలు, ప్రజలు పాల్గొన్నారు.