విద్యార్థులతో ఎంపీ వేమిరెడ్డి ముఖాముఖి: ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
విద్యార్థులతో ఎంపీ వేమిరెడ్డి ముఖాముఖి: ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
కావలి మేజర్ న్యూస్:
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి జవహర్ భారతి కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమం కింద సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు, కెరీర్‌పై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంపీ వేమిరెడ్డి ఆలోచనాత్మకమైన సమాధానాలు ఇచ్చారు.
మన జిల్లాకు అనేక పరిశ్రమలు వస్తున్నాయని, అందుబాటులోకి వచ్చే ఉపాధి అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. తనకు సేవాగుణమంటే ఎంతో ఇష్టమని, అందుకే జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ఎంపీ వేమిరెడ్డిని విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి, కళాశాల కరస్పాండెంట్ ఎం. వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, డీన్ డాక్టర్ పి. సుబ్రహ్మణ్యం నాయుడు, డైరెక్టర్ డాక్టర్ ఆర్. మాల్యాద్రి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎస్తేర్ బ్యులా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు