BREAKING
నేటి ద్వాదశ రాశి ఫలాలు: మంగళవారం, 29 సెప్టెంబర్ 2026 పన్నెండు రాశుల సమగ్ర భవిష్యత్ ఫలితాలు నేటి పంచాంగం: మంగళవారం, 29 సెప్టెంబర్ 2026 తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం మరియు శుభ ముహూర్తాల సమాచారం నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్.ఎల్.సి) కార్యక్రమం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ సేవలు మరింత విస్తరణ : మంత్రి సత్యకుమార్ యాదవ్ రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు---*మంత్రి నారాయణ నెల్లూరు, రవితేజ బ్యూరో, మేజర్ న్యూస్: పేదలకు సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయానిధి 85 శాతం రాయితీతో పశుబీమా పశుపోషకులకు అండగా నూతన పశుబీమా పథకం చిత్తూరు జిల్లాలో మళ్లీ ఏనుగుల సంచారం చిన్నారులకు ఎమ్మెల్యే కావ్య ఆశీస్సులు విద్యార్థులతో ఎంపీ వేమిరెడ్డి ముఖాముఖి: ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఏరియా వైద్యశాలలో 'సేవా సంకల్ప అభియాన్': ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య. ఉదయగిరి నియోజకవర్గ వెనుకబాటు ను సీయం కు వివరించండి నేపాల్‌లో జలవిలయం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం

నెల్లూరు, రవితేజ బ్యూరో, మేజర్ న్యూస్:

Select Suryaa Now
నెల్లూరు, రవితేజ బ్యూరో, మేజర్ న్యూస్:

రేబీస్ వ్యాధి పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

"వరల్డ్ రేబిస్ డే"
(ప్రపంచ రేబిస్ నివారణ దినోత్సవం).

డాక్టర్. ఆర్.చందన్ రెడ్డి,
జిజిహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్.

నెల్లూరు,  మేజర్ న్యూస్ :మానవులు మరియు జంతువులపై రేబిస్ ప్రభావం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు, జిజిహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.చందన్ రెడ్డి అన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) బ్లాక్ బోర్డ్ మిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం, శెట్టిగుంటరోడ్డు లోని వై.వి.ఎం.సి. హైస్కూల్ నందు రేబిస్ వ్యాధిపై అవగాహన మరియు ర్యాలీ జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమృత చిన్న పిల్లల హాస్పిటల్ వైద్య నిపుణులు జిజిహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.చందన్ రెడ్డి ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి ఏడాది సెప్టెంబర్ 28న  ప్రపంచ రేబీస్ వ్యాధి నివారణ దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని, మొదటి రేబీస్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్ధం ఆయన మరణించిన రోజైన సెప్టెంబర్ 28న నిర్వహిస్తారని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు పాన్ అమెరికన్ ఆరోగ్యసంస్థ, జంతు ప్రపంచ సంస్థల సహకారంతో అమెరికా లోని అట్లాంటాలో వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం, అలయిన్స్ ఫర్ రాబిస్ కంట్రోల్ సంస్థల భాగస్వామ్యంలో 2007 సెప్టెంబర్ లో తొలిసారిగా ఈ ప్రపంచ రేబీస్ దినోత్సవం జరిగిందని, రేబీస్ అనేది పిచ్చి కుక్కలు లేదా ఇతర వ్యాధి సోకిన జంతువులు కరవడం లేదా గీరడం, నాకడం వల్ల మనుషులకు సోకే అత్యంత ప్రాణాంతకమైన వైరల్ వ్యాధిఅని, ఇది కేంద్రీకృత నాడీ వ్యవస్థను (Central Nervous System) ప్రభావితం చేసే "లైసా వైరస్" వల్లవస్తుందన్నారు. కుక్కలు, పిల్లులు, నక్కలు, కోతులు, గబ్బిలాలు వంటి క్షీరదాల లాలాజలం ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందని, ఈ వైరస్ సోకిన జంతువులు కరిచినా, గోళ్ళతో గీరిన లేదా వాటి లాలాజలం తెరుచుకున్న గాయాలపైపడినా ఆ వైరస్ మనిషికి చేరుతుందని తెలిపారు. రేబీస్ సోకిన వ్యక్తికి ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, అలసట, బలహీనత, గాయం ఉన్న ప్రదేశంలో దురద, మంట లేదా తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయని, ఆ తర్వాత నీటిని చూసి భయపడడం (Hydrophobia), మింగినప్పడు తీవ్రమైన ఇబ్బందివల్లే నీరు లేదా ద్రవాలను చూస్తే వారికి భయంకలుగుతుంది. అధికంగా లాలాజలం ఊరడం, ఆందోళన, భ్రాంతులు, మరియు గందరగోళం, అతిగా ప్రవర్తించడం లేదా హైపరాక్టివిటి, మూర్చలు మరియు పక్షవాతం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయని, ఇటువంటి లక్షణాలు కనిపించిన తర్వాత రేబీస్ ప్రాణాంతకం కావచ్చు. కనుక జంతువు కరిచిన వెంటనే గాయంపై సబ్బు మరియు నీటితో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రంగా కడగాలన్నారు. లక్షణాలు ప్రారంభం కాకముందే వెంటనే యాంటీ-రేబీస్ టీకా (Anti -rabies vaccination)  తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చునని, సమయానికి చికిత్స అందించగల్గితే వారి  ప్రాణాలను కాపాడగలమన్నారు.
ఈ ఏడాది థీమ్ "స్ట్రాంగర్ టుగెదర్" (Stronger Together) ప్రకారం అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే రేబీస్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం జరుగుతుందనే సందేశాన్ని, రేబీస్ వ్యాధి తీవ్రత దానివల్ల కలిగే ప్రాణనష్టం, ముఖ్యంగా జంతువుల ద్వారా మనుషులకు ఎలా వ్యాపిస్తుందనే అంశాలపై  ప్రజలకు మనమంతా  అవగాహన పెంచడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్ చందన్ రెడ్డిని, హెచ్ఎం ఇ.జాస్మినమ్మను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఇ.జాస్మినమ్మ, జిల్లా పీ.హెచ్.పీ నాయకులు శాఖవరపు వేణుగోపాల్, దేవరకొండ శ్రీనివాసులు, నరసాపురం ప్రసాద్, ఉప్పలపాటి రామదాసు, ఏ.రాజశేఖర్, షేక్ ఖాదర్ బాషా, శివ ప్రసాద్, గౌస్ మొహిద్దిన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు