BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్వతీపురం మండలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృత స్థాయి సమావేశం పల్లె పండుగతో రాష్ట్ర ప్రగతికి సరికొత్త ఊతం అల్యూమినియం అభివృద్ధియే లక్ష్యం భారతదేశపు తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతాం ఒడిశా మైనింగ్ సామర్థ్యం, బెంగాల్ వ్యాపార సామర్థ్యంతో బలమైన అల్యూమినియం వ్యాల్యూ చైన్ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అల్యూమినియం ఉత్పత్తితో పాటు.. విలువ ఆధారిత వ్యవస్థగా మార్చడం లక్ష డంపింగ్‌ యార్డు తరలించాలి సబ్సిడీ రుణాల పేరుతో మోసం చేశారంటూ ఎస్పీకి ఫిర్యాదు దామచర్ల డిజైన్‌లో.. కొత్త ఒంగోలు ప్రారంభ ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా రాయలసీమ జెన్ స్టార్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జాగ్నేష్ కుమార్ రాజీనామా చేయాలి టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు! గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ శాఖకు Q2లో రూ. 369.62 కోట్ల రాబడి; 25 మద్యం షాపులకు నోటిఫికేషన్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ

శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన

Select Suryaa Now
శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి  విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి  విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు  వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: శాస్త్రీయ విద్యా విధానం కోసం విద్యార్థులు పోరాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం హనుమకొండలో వేలాది మంది విద్యార్థులతో మహా ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పబ్లిక్ గార్డెన్ నుండి ప్రారంభమైన విద్యార్థి ప్రదర్శన కేయూ క్రాస్ రోడ్ మీదుగా కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియం వరకు కొనసాగింది. అనంతరం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవం బహిరంగ సభలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 90 ఏండ్ల చరిత్ర ఏ విద్యార్థి సంఘానికి లేదని, స్వాతంత్ర్య ఉద్యమంలో పురుడు పోసుకుని దేశ స్వాతంత్ర్యం, దేశ భద్రత, శాస్త్రీయ విద్య లక్ష్యాలుగా చదువుతూ పోరాడు.. చదువుకై పోరాడు అన్న నినాదం ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావం జరిగిందని తెలిపారు.కమ్యూనిస్టు భావజాలాన్ని పునికిపుచ్చుకున్న కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ వారసత్వంతో ఏఐఎస్ఎఫ్ పుట్టిందని, దేశంలో ప్రథమ విద్యార్థి సంఘం అయిన ఏఐఎస్ఎఫ్ లో నెహ్రూ, అటల్ జీ లాంటి వారు పని చేశారని తెలిపారు. నాటి నుండి నేటి వరకు ఏఐఎస్ఎఫ్ శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడుతున్నదని, ఏఐఎస్ఎఫ్ లో పని చేసిన వారు ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. నేడు విద్యా రంగం పలు సమస్యలను ఎదుర్కొంటున్నదని, విద్యార్థి లోకాన్ని నిర్వీర్యం చేసేలా పాలకుల విధానాలు కొనసాగుతున్నాయని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యా రంగంలో కాషాయీకరణ చొప్పిస్తూ విద్యార్థులలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నదని విమర్శించారు. విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యార్థుల నుండి రేపటి నవతరం నాయకులు తయారు కావాలని, అందుకు విద్యా సంస్థలలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. వరంగల్ లోని ఆర్ఈసి నుండి ఒకప్పుడు ఎంతో మంది నాయకులు తయారై సమాజానికి సేవలందించారని గుర్తు చేశారు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి కళాశాలలో ఏఐఎస్ఎఫ్ జెండా ఎగురాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతో శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు కావాలని, భగత్ సింగ్ వారసులుగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ, వివేకానందుడి బోధనలను ఆయన ఉటంకిస్తూ సమాజాన్ని బాగు చేసే ముందు యుగం దూతలుగా విద్యార్థులు ఎదగాలని అన్నారు. భారత రాజకీయాల్లో పాలకుల విధానాలను మార్చే శక్తి విద్యార్థులదేనని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగి రాజన్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ భగత్ సింగ్ వారసులైన విద్యార్థుల శక్తి జెన్ జీ ఉద్యమంగా మారిందని తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తూ విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. చివరకు ఎన్నికల కమిషన్ ను ప్రయోగించి విద్యార్థి, యువ జనుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ను ఆ పదవి నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఇందుకోసం రియల్ హీరో లైన భగత్ సింగ్, బీఆర్ అంబేద్కర్, బిర్సాముండా లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కసిరెడ్డి మణికంట రెడ్డి, పుట్టా లక్ష్మణ్,రాష్ట్ర యూనివర్సిటీల ఇంచార్జ్ రెహమాన్, హనుమకొండ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఉట్కూరి ప్రణీత్ గౌడ్, బాషబోయిన సంతోష్, వరంగల్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దిడ్డి పార్థసారథి, ల్యాదెళ్ల శరత్ తదితరులు పాల్గొన్నారు.