అల్యూమినియం అభివృద్ధియే లక్ష్యం భారతదేశపు తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతాం ఒడిశా మైనింగ్ సామర్థ్యం, బెంగాల్ వ్యాపార సామర్థ్యంతో బలమైన అల్యూమినియం వ్యాల్యూ చైన్ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అల్యూమినియం ఉత్పత్తితో పాటు.. విలువ ఆధారిత వ్యవస్థగా మార్చడం లక్ష
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశపు తూర్పు ప్రాంతాన్ని దేశ పారిశ్రామిక అభివృద్ధికి కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంవిత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఒడిశా మినరల్ సామర్థ్యాన్ని పశ్చిమబెంగాల్ లోని ఇండస్ట్రియల్, ఫైనాన్షియల్, లాజిస్టిక్స్ సామర్థ్యంతో అనుసంధానించడం ద్వారా ఈ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా అభివృద్ధి చేసేందుకు అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కోల్‌కతాలో నిర్వహించిన అల్యూమినియం రోడ్ షోలో పరిశ్రమలు, వ్యాపార రంగాల ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడారు. భారతదేశ పారిశ్రామిక చరిత్రలో బెంగాల్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. స్వామి వివేకానంద, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులను అందించిన నేల ఇది. భారతదేశానికి ఆలోచనలను, సాహిత్యాన్ని, సంస్కృతిని, నాయకత్వాన్ని అందించడంతోపాటు పారిశ్రామికాభివృద్ధిలోనూ బలమైన పునాదులు వేసిన ప్రాంతం. ఆ వైభవాన్ని ఆధునిక పారిశ్రామిక అవకాశాలతో అనుసంధానించి బెంగాల్‌ను మరోసారి దేశ అభివృద్ధిలో కీలక శక్తిగా నిలపాల్సిన సమయం వచ్చింది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం.. బెంగాల్‌లో అనుసంధానత, లాజిస్టిక్స్, పోర్ట్స్, రైల్వే ప్రాజెక్టులు, రోడ్ ప్రాజెక్టులు సహా మౌలికవసతుల కల్పనను బలోపేతం చేస్తోందని.. కేంద్రమంత్రి పేర్కొన్నారు. అండర్-రివర్ మెట్రో వంటి ఆధునిక ప్రాజెక్టుల నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ల వరకు.. కనెక్టివిటీని విస్తరిస్తూ, స్థానిక పరిశ్రమలు అంతర్జాతీయ మార్కెట్ ను చేరుకునేందుకు అవసరమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రక్షణ, రైల్వే, పునరుత్పాదక విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్ సహా అనేక రంగాల్లో అల్యూమినియం పాత్ర కీలకమని.. భారత్ నెట్ జీరో 2070 లక్ష్య సాధనలోనూ అల్యూమినియం ప్రధానపాత్ర పోషిస్తుందని తెలిపారు.
మన లక్ష్యం అల్యూమినియం ఉత్పత్తి పెంచడంతోపాటుగా.. మన దేశంలో ఉత్పత్తి అయ్యే అల్యూమినియంకు ఇక్కడే వ్యాల్యూ అడిషన్ జరగాలి. హై-వ్యాల్యూ ఫినిష్‌డ్ ప్రొడక్ట్స్ ను భారత్ లోనే తయారు చేయాలి. అదే ఆత్మనిర్భర భారత్ లక్ష్యం’ అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. భారత్ ప్రపంచ అల్యూమినియం రంగంలో ప్రధానపాత్ర పోషిస్తున్నప్పటికీ.. దేశంలోని ఉత్పత్తి సామర్థ్యానికి, విలువ ఆధారిత వినియోగానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ లక్ష్యంతో రూపొందించిన అల్యూమినియం విజన్ 2047 ద్వారా దేశ అల్యూమినియం ఉత్పత్తిని దాదాపు ఆరు రెట్లు పెంచడం, బాక్సైడ్ ఉత్పత్తిని 150 (మిలియన్ టన్ పర్ యానమ్) కు తీసుకెళ్లడం, రీసైక్లింగ్ ను గణనీయంగా పెంచడం, లో-కార్బన్ టెక్నాలజీస్ ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రపంచ అల్యూమినియం మార్కెట్ లో భారత్ వాటాను 2023లోని 3.8% నుంచి 2047 నాటికి 10%కు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
అనంతరం, మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బొగ్గు కొరత లేదని.. నిరంతరం బొగ్గు ఉత్పత్తి, సరఫరా జరుగుతూనే ఉందన్నారు. ‘వర్షాకాలం సమయంలో బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన సమస్యలుండటం సహజమే. వర్షాకాలం పూర్తవుతున్నందున.. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి యధాతథంగా జరుగుతోంది. సాధ్యమైనంత మేర బొగ్గు సరఫరా చేస్తున్నాం’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.