కుల్కచర్లలో పురాతన ఇంట్లో తవ్వకాలు
గుప్తనిధుల కోసం తవ్వుతున్నారనే అనుమానాలతో కలకలం
కుల్కచర్ల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 29):
కుల్కచర్లలో గుప్తనిధుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలోని ఓ పురాతన ఇంట్లో గత కొంతకాలంగా అనుమానాస్పదంగా తవ్వకాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో తవ్వకాలు జరుగుతున్నాయనే ప్రచారం గ్రామంలో ఆసక్తి రేకెత్తిస్తోంది. పురాతన ఇంట్లో తవ్వకాలు జరుగుతుండటంతో చుట్టుపక్కల నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాల కారణంగా ఇరుగుపొరుగు ఇళ్లకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే ఈ తవ్వకాలు నిజంగానే గుప్తనిధుల కోసం జరుగుతున్నాయా…? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా…? అన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారిస్తామని కుల్కచర్ల ఎస్‌ఐ రమేష్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
రిపోర్టర్ వడ్ల వినోద్ కుమార్.