గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత
ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలి
సర్పంచ్ లావణ్య మోహన్
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 29): గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దుర్గం చెరువు గ్రామ సర్పంచ్ లావణ్య మోహన్ అన్నారు. మండల పరిధిలోని దుర్గం చెరువు గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రెండు బోర్లు మంజూరు చేయించినట్లు ఆమె తెలిపారు.గ్రామంలో తాగునీటి ఇబ్బందులను స్థానికులు సర్పంచ్ లావణ్య మోహన్ దృష్టికి తీసుకురాగా, ఆమె వెంటనే తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. సమస్యపై స్పందించిన స్పీకర్ రెండు బోర్లను మంజూరు చేయడంతో, ఆయన సహకారంతో గ్రామంలో బోర్లను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సత్యనారాయణ గౌడ్, శేఖర్, ప్రభు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్ వడ్ల మాణిక్య చారి.