పరికరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
సూర్య ప్రతినిధి ఇల్లందు : పోలీస్ స్టేషన్లో పరికరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొమరారం పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. పోలీస్ స్టేషన్లోని పరికరాలను, రికార్డులను, పెండింగ్ కేసులు, దర్యాప్తులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు సమస్యలతో వచ్చే బాధితుడికి న్యాయం చేసేలా వ్యవహరించాలన్నారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సాధించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నెల పట్టా ప్రజలను ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించి తీసుకునే జాగ్రత్తల పై వివరించాలన్నారు. అనంతరం స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల ను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగుల్ మీరా, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు సూర్య రూరల్ రిపోర్టర్ డానియల్