చౌటుప్పల్‌కు రూ.15 కోట్ల అభివృద్ధి వరం
చౌటుప్పల్, మేజర్ న్యూస్:చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నగరాభివృద్ధి పథకం కింద రూ.8.50 కోట్లతో డ్రైనేజీ, రూ.6.50 కోట్లతో సీసీ రోడ్ల పనులు చేపట్టనున్నారు. 1 నుంచి 20 వార్డుల్లోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరగనున్నాయి. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్‌కుమార్, ఆర్డీవో శేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ ఎఎంసి చైర్మన్ ఉబ్బు వెంకటయ్య,వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేన రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ ఈడుదుల మస్తాన్ యాదవ్,వైస్ చైర్మన్ పర్నె శివా రెడ్డి,కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి,పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, బద్రి గాలయ్య , దేప రమ్య రాజు ,పాక చిరంజీవి ,బత్తుల వాణి విప్లవ్ కుమార్ ,ఉడుగు జ్యోతి రమేష్ ,బత్తుల జయమ్మ దాసు,చింతల ఉమామహేశ్వరి సాయిలు ,పిల్లలమర్రి మధుసూధన్,హన్ను మహమ్మద్,కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగరాములు, సందగళ్ళ విజయ సతీష్, మహమ్మద్ బాబా షరీఫ్, షేక్ నబీబి జానీ బాబా,స్థానిక నాయకులు పాల్గొన్నారు.