BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ వైద్యుడు అరెస్ట్

Select Suryaa Now
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ వైద్యుడు అరెస్ట్

తిమ్మాయిపల్లిలో ఎస్‌ఓటీ, వైద్య ఆరోగ్య శాఖ, కీసర పోలీసుల సంయుక్త దాడి
క్లినిక్‌ సీజ్‌.. ఔషధాలు, వైద్య పరికరాలు స్వాధీనం
అర్హతలు లేని వైద్యులపై కఠిన చర్యలు తప్పవు: సీఐ బిక్కి రమేష్‌

కీసర, మేజర్‌ న్యూస్ (సెప్టెంబర్‌ 29):
ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే ఆర్‌ఎంపీ వైద్యుడిగా చలామణి అవుతూ క్లినిక్‌ నిర్వహిస్తున్న వ్యక్తిని కీసర పోలీసులు అరెస్ట్‌ చేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి ప్రత్యేక కార్యాచరణ బృందం (ఎస్‌ఓటీ), వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కీసర పోలీసులు సంయుక్తంగా మంగళవారం తిమ్మాయిపల్లిలో నిర్వహించిన దాడిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.కీసర ఇన్‌స్పెక్టర్‌ బిక్కి రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌ జిల్లాకు చెందిన పత్తిరి తరుణ్‌ ప్రస్తుతం జవహర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకపోయినా తిమ్మాయిపల్లి గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా బోర్డు ఏర్పాటు చేసుకుని క్లినిక్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. చికిత్స పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో అధికారులు సంయుక్తంగా క్లినిక్‌పై దాడి చేశారు.

క్లినిక్‌ సీజ్‌.. కేసు నమోదు

దాడిలో తరుణ్‌కు ఎలాంటి వైద్య అర్హత ధ్రువపత్రాలు లేవని అధికారులు గుర్తించారు. క్లినిక్‌లో ఉన్న ఔషధాలు, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు క్లినిక్‌ను సీజ్‌ చేశారు. అనంతరం పత్తిరి తరుణ్‌ను అదుపులోకి తీసుకుని కీసర పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

కఠిన చర్యలు తప్పవు: సీఐ బిక్కి రమేష్‌

అర్హతలు లేకుండా వైద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కీసర ఇన్‌స్పెక్టర్‌ బిక్కి రమేష్‌ హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో అనుమతులు, వైద్య అర్హతలు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తున్న వారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.రిపోర్టర్ కర్రె  గణేష్.