BREAKING
దామచర్ల డిజైన్‌లో.. కొత్త ఒంగోలు ప్రారంభ ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా రాయలసీమ జెన్ స్టార్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జాగ్నేష్ కుమార్ రాజీనామా చేయాలి టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు! గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ శాఖకు Q2లో రూ. 369.62 కోట్ల రాబడి; 25 మద్యం షాపులకు నోటిఫికేషన్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ బలిజ కుల బాంధవుల సేవే లక్ష్యంగా నిరంతర కృషి బంగారం షాప్ లో చోరీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీసర్వేలో అలసత్వం సహించేది లేదు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రీసర్వే పురోగతిపై మంత్రి పొంగులేటి అసంతృప్తి నవంబర్ 15లోగా నాణ్యతతో రీసర్వే పూర్తి చేయాలి – అధికారులకు మంత్రి ఆదేశం ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

కీసరలో గంధమల్ల అజయ్ అదృశ్యంపై ఉత్కంఠ, 25 రోజులుగా జాడ లేదంటూ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన కుటుంబం

Select Suryaa Now
కీసరలో గంధమల్ల అజయ్ అదృశ్యంపై ఉత్కంఠ, 25 రోజులుగా జాడ లేదంటూ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన కుటుంబం

కీసర పోలీసుల తీరుపై బాధితుల ఆగ్రహం, కారును గుర్తించిన వేగమే అజయ్ జాడపై చూపాలని డిమాండ్

కీసర,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 28):శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు ఇరవై ఐదు రోజులుగా గల్లంతైన యువకుడు అజయ్ ఆచూకీ లభించకపోవడంతో ఆ కుటుంబం వేదన నరకప్రాయంగా మారింది. పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాధితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా, మరోవైపు స్థానిక మహంకాళి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టి పరారైన కారును పోలీసులు సాంకేతిక ఆధారాలతో విజయవంతంగా గుర్తించారు. ఈ రెండు ఘటనలు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా, పోలీసులు ఒక కేసులో గాలింపు చర్యలు వేగవంతం చేయగా మరో కేసులో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.కీసర మండలానికి చెందిన గంధమల్ల అజయ్ అనే యువకుడు ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత అదృశ్యమై ఇరవై ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి క్లూ లభించకపోవడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అజయ్ కనిపించడం లేదంటూ అతని తండ్రి శంకర్ ఈ నెల నాలుగో తేదీనే కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ పోలీసుల నిర్లక్ష్యం మరింత పెరుగుతోందని ఆరోపిస్తూ బాధితులు చివరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఉన్నతాధికారులు స్పందించి వేగవంతమైన దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కిందిస్థాయి సిబ్బంది మాత్రం కేసును పట్టించుకోకుండా తూతూమంత్రంగా విచారణ జరుపుతున్నారంటూ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.తమ కుమారుడి అదృశ్యం వెనుక ఓ అమ్మాయి హస్తం ఉందని, ఆమె పదే పదే ఫోన్ చేసి అజయ్ ఆచూకీ గురించి ఆరా తీసిందని బాధిత కుటుంబం చెబుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తమవుతోంది. ఆ అమ్మాయి కుటుంబంపై తమకు తీవ్ర అనుమానాలు ఉన్నాయని పోలీసులకు స్పష్టంగా వివరించినప్పటికీ కనీస విచారణ కూడా చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించి, సీసీటీవీ ఫుటేజీలు మరియు కాల్ డేటా రికార్డులను లోతుగా విశ్లేషించి అజయ్ జాడ కనిపెట్టాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ వేడుకుంటున్నారు.మరోవైపు కీసర అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టి ధ్వంసం చేసిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకుని వేగంగా దర్యాప్తు పూర్తి చేశారు. సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి సమయంలో గుర్తుతెలియని వాహనం ఆలయ గోడను బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారైన సంఘటనపై పెట్రోలింగ్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కూపీ లాగిన పోలీసులు, ఆ ప్రమాదానికి కారణమైన ఎంజీ విండ్సర్ కారును గుర్తించడమే కాకుండా అది కీసరకు చెందిన జలాలపురం సుధాకర్ రెడ్డికి చెందినదిగా తేల్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వాహన యజమాని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా, ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన స్థానిక ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్సైలు మరియు సిబ్బందిని మల్కాజ్‌గిరి డీసీపీ శ్రీధర్, జవహర్‌నగర్ డివిజన్ ఏసీపీ చక్రపాణి ప్రత్యేకంగా అభినందించారు. రిపోర్టర్ కర్రె గణేష్.