telanagana
మహంకాళి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టిన కారు గుర్తింపు
సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో వాహనాన్ని గుర్తించిన కీసర పోలీసులు
కీసర, మేజర్ న్యూస్, (సెప్టెంబర్ 28):కీసర అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టి వెళ్లిపోయిన వాహనాన్ని కీసర పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి కారణమైన MG Windsor కారు (TG 08 AE 5553)ను గుర్తించారు.పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 27న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య గుర్తుతెలియని వాహనం మహంకాళి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టడంతో గోడ ధ్వంసమైంది. అనంతరం వాహన డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పెట్రోలింగ్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కీసర పోలీస్ స్టేషన్‌లో కేసు నం. 961/2026, BNS సెక్షన్ 281 కింద కేసు నమోదు చేశారు.దర్యాప్తులో భాగంగా సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు వాహనాన్ని, దాని యజమానిగా కీసర నివాసి జలాలపురం సుధాకర్ రెడ్డి గా గుర్తించారు. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ కేసును త్వరితగతిన ఛేదించి వాహనాన్ని గుర్తించిన కీసర ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్‌ఐ శ్రీనివాస్, పీసీ సాయి కృష్ణలను మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ ఐపీఎస్ అభినందించినట్లు పోలీసులు తెలిపారు. రిపోర్టర్ కర్రె గణేష్.