BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Select Suryaa Now
ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 28, మేజర్  న్యూస్:

ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్రీనివాస నగర్‌లో బాలాజీ గ్యాస్ ఏజెన్సీ ఎదురుగా నివాసం ఉంటున్న కృష్ణయ్య (40) సోమవారం ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు హమాలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని తండ్రి పేరు పెంచలయ్య. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ కలహాల కారణంగా కృష్ణయ్య భార్య ఈ నెల 26వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణయ్య ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి చిన్నక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ వంశీనాధ్ తెలిపారు